Teluguwishesh చందమామ కథలు చందమామ కథలు Chandamama Kathalu Review, Chandamama Kathalu Telugu Movie Review, Chandamama Kathalu Movie Review, Chandamama Kathalu Movie Review, Rating, Manchu Lakshmi Chandamama Kathalu Movie, Chandamama Kathalu Movie Stills, Wallpapers, Songs, Trailers, Videos and more on teluguwisesh.com Product #: 52047 3/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    చందమామ కథలు

  • బ్యానర్  :

    ఎ వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్

  • దర్శకుడు  :

    ప్రవీణ్ సత్తరు

  • నిర్మాత  :

    చాణక్య బూనేటి

  • సంగీతం  :

    మిక్కీ జే మేయర్

  • సినిమా రేటింగ్  :

    3/53/53/5  3/5

  • ఛాయాగ్రహణం  :

    సురేష్ రగుతు

  • ఎడిటర్  :

    ధర్మేంద్ర కకరాల

  • నటినటులు  :

    లక్ష్మి మంచు, ఆమని, నరేష్ తదితరులు

Chandamama Kathalu Movie Review

విడుదల తేది :

ఏప్రిల్ 25, 2014

Cinema Story

సారధి (కిషోర్ ) ఓ రచయిత. అతనికి క్యాన్సర్ తో బాధ పడుతున్న కూతురు ఉంటుంది. ఆమెను దక్కించుకోవాలంటే డాక్టర్లు భారీ మొత్తం డబ్బు అవసరం అవుతుందని చెబుతారు. కానీ అతని దగ్గర అంత డబ్బు ఉండదు. దాని కోసం కథను రాయడం మొదలు పెడతాడు. అందులో భాగంగా తన జీవితానికి దగ్గరగా ఉన్న పాత్రల్ని తీసుకొని మొత్తం ఎనమిది కథలు రాస్తాడు. తాను రాసిన కథలో ఆ ఏడు కథల్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ? ఈయనకు కావాల్సిన డబ్బుల కోసం ఆ కథను రాశాడా ? కూతురు వైద్యానికి కావాల్సిన సొమ్మును ఈ తాను రాసిన కథ ద్వారా సంపాదించుకొని కేర్సర్ బారి నుండి తన కూతుర్ని కాపాడు కుంటాడా ? ఈయన డబ్బులకు ఆ కథలకు ఉన్న సంబంధం ఏమిటన్నది తెర పై చూడాల్సిందే.

cinima-reviews
చందమామ కథలు

ఇటీవల కాలంలో పెద్ద దర్శకులను తలదన్నేలా చిన్న చిన్న దర్శకులు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రియాల్టీకి దగ్గరగా ఉండే సినిమాలు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. అలాంటి దర్శకుల్లో ప్రవీణ సత్తారు ఒకడు. ఎల్ బీ డబ్య్లూ , రొటీన్ లవ్ స్టోరీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు మూడో చిత్రంగా తీసిన చందమామ కథలు చిత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమది కథల్ని ఒకే సినిమాలో చూపించాడు. ఒకే టిక్కెట్ పై వంద సినిమాలు అనే మాదిరి ఒక సినిమాలో ఎనిమిది కథల్ని దర్శకుడు ఎలా చూపించాడు. దర్శకుడు చెప్పిన ఎనిమిది కథలకు థియేటర్లలో ప్రేక్షకులను నిద్ర బుచ్చాడా ? లేదా అనేది ఈ సినిమా రివ్య్యూ ద్వారా చూద్దాం.

Cinema Review

ముఖ్యంగా బిచ్చగాడి  పాత్రలో రచయిత కృష్ణేశ్వరరావు నటనను ప్రశంసించాల్సిందే. ఇంకా లిసా స్మిత్గా ఓ మోడల్గా నటించిన మంచు లక్ష్మి ఓ డిఫెరెంట్ పాత్రతో ఆకట్టుకున్నారు. సారథిగా కిషోర్, కూతురు పాత్రలో కావేరి పూర్తిస్థాయి న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నింటికీ అందరూ పూర్తి న్యాయం చేకూర్చారు.  వెన్నెల కిషోర్‌, కొండ‌వ‌ల‌స ల‌కు సెప‌రేట్ బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివ‌రీ ఉంటుంది. కానీ ఈ సినిమాల్లో నూ వాళ్ల‌చేత బాలెన్స్ న‌ట‌న రాబట్టుకొన్నాడు ద‌ర్శకుడు.

త‌మ స్టైల్‌ ని పూర్తిగా మార్చుకొని ద‌ర్శకుడుకీ, క‌థ‌కీ ఏం కావాలో అదే చేశారు. లక్ష్మి మంచు మోడల్ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు ముఖ్యంగా తన యాస ఈ పాత్రకు చాలా ఉపయోగపడింది. లైఫ్ లో ప‌డుతున్న స్ట్రగుల్‌ ని బాగా చూపించ‌గ‌లిగింది. బిచ్చగాడి పాత్రలో కనిపించిన క్రిష్టారావు అధ్బుతంగా నటించారు. న‌రేష్‌, ఆమనిల మ‌ధ్య సాగిన ల‌వ్‌ట్రాక్ కూడా ఒకే. కానీ లిప్ లాక్ సీన్ ఒక్కటే.. కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. అర‌వై ఏళ్ల దాటిన త‌ర‌వాత కూడా ప్రేమ ఉంటుంది, ఎవ‌రి జీవితాల్ని వాళ్లు నిర్ణయించు కోవ‌చ్చు తెలియజేశాడు. కృష్ణుడు పాత్రకు తగ్గ ప్రదర్శన కనబరిచారు. మిగతా వారు తన పాత్రల మేరకు నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం :

ప్రవీణ్ సత్తారు ఎనమిది కథలను ఒకే సినిమాగా చూపించాలనే ప్రయత్నానికి తన వంతుగా సహకారం అందించాడు మిక్కీ జే మేయర్ . ఆయన అందించిన బ్యాక్ గ్రౌడ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సురేష్ తన ఫొటో గ్రఫీతో ఆకట్టుకున్నాడు. ప్రతి ఫ్రేంని చాలా చక్కగా చూపించాడు.

ధర్మేంద్ర కత్తెరకు మరింత పదును పెట్టి ఉండాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్లో పాత్రల పరిచయం కొంత డాక్యుమెంటరీ స్టైల్లో అనిపించడానికి పూర్ ఎడిటింగ్ కారణమని అనిపిస్తుంది. సంభాష‌ణ‌లు లైట్ గా ఉన్నాయి. గుర్తుండి పోయే డైలాగులు ఒక్కటీ లేవు. అలాగని మరీ త‌ల‌లు ప‌ట్టుకొన్న డైలాగూ లేదు. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు చేసిన ఈ ప్రయోగంలో చాలా వరకు సఫలీక్రుతం అయ్యాడని చెప్పవచ్చు.

more