Teluguwishesh పైసా పైసా Paisa Telugu Movie Review, Telugu Paisa Movie Review, Paisa Movie Review, Paisa Review, Paisa Movie Review and Rating, Paisa Movie Stills, Paisa Movie Audio Songs, Paisa Movie Trailers, Videos. Product #: 49988 2.5/5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    పైసా

  • బ్యానర్  :

    ఎల్లో ఫ్లవర్స్

  • దర్శకుడు  :

    క్రిష్ణ వంశీ

  • నిర్మాత  :

    రమేష్ పుప్పాల

  • సంగీతం  :

    ఈబె సాల్విన్

  • సినిమా రేటింగ్  :

    2.5/52.5/5  2.5/5

  • ఛాయాగ్రహణం  :

    సంతోష్ రాయ్

  • ఎడిటర్  :

    త్యాగరాజన్

  • నటినటులు  :

    నాని, కేథరిన్ థెరిసా

Paisa Movie Review

విడుదల తేది :

ఫిబ్రవరి 7, 2014

Cinema Story

ప్రకాష్ (నాని ) పాత బస్తీలో ఉంటూ మోడలింగ్ రంగంలో రాణించి కోటి రూపాయలు సంపాదించి జీవితంలో సెటిల్ అయిపోదామనుకుంటాడు.. బాగా డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తే పెద్దింటికి అల్లుడు అయిపోవచ్చని కలలు కంటూ స్వీటీ (సిద్దిక) అనే అమ్మాయి ప్రేమిస్తాడు. కానీ పాతబతస్తీలో ఉండే నూర్ (కేథరిన్) ప్రకాష్ ని బాగా ఇష్టపడుతుంది. కానీ ప్రకాష్ తనని పట్టించుకోకపోవడం వల్ల ఆమె ఓ అరబ్ షేక్ ని పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతుంది. ప్రకాశ్ కు అనుకోకుండా యాభై కోట్ల రూపాయలు చేతికి చిక్కుతాయి. ప్రకాశ్ కు చిక్కిన యాభై కోట్లు ఎవరివి ? ఎక్కడివి ? వాటిని ప్రకాష్ నుండి తిరిగి తీసుకోవడానికి ప్రకాష్ వెంట పడేది ఎవరు ? చివరకు ఆ డబ్బు ఎవరికి దక్కుతుంది ? నూర్ తనకి దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే తెర పైన చూడాల్సిందే.

cinima-reviews
పైసా

టాలీవుడ్ లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్ణవంశీ, టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక మైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నాని కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘పైసా ’. గత కొన్ని నెలలుగా ‘పైసలు ’ లేక వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ దర్శకుడు కావడం, ‘ఈగ ’ తరువాత విడుదలవుతున్న నాని చిత్రం కావడంతో ఈ చిత్రం ఎన్ని సార్లు వాయిదా పడినా దీనికి ఉన్న క్రేజ్ మాత్రం పోలేదు. మరి ఇన్నాళ్ళ తరువాత వచ్చిన ‘పైసా ’ చిత్రానికి పైసలు వచ్చే కథ ఉందో లేదో ఈ సినిమా ద్వారా చూద్దాం.


క్రిష్ణవంశీ తీసే సినిమాలు  అన్నీ వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాను కూడా మన చుట్టు జరిగే  చిన్న సంఘటనను తీసుకొని తెరకెక్కించాడు. ఆ చిన్న పాయింట్ చుట్టు క్రైమ్,  ప్రేమ, కొన్ని రాజకీయ పరిస్థితులను అల్లి తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో కథ ఒక్క ట్రాక్ లో నడవకుండా పక్కదారి పట్టి అంతా గందరగోళం అయిపోతుంది. చిత్రమంతా పాతబస్తీలోని చార్మినార్ నేపథ్యంగా సాగుతుంది. పాతబస్తీలో ఉండే పరిస్థితులను కృష్ణవంశీ చక్కగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో పతంగి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు కృష్ణవంశీ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.

చేజారిన డబ్బును దక్కించుకోవడానికి కొన్ని బ్యాచ్ లు, అనుకోకుండా చేజిక్కిన డబ్బును కాపాడుకోవడానికి నాని వేసే ఎత్తులతో సెకండాఫ్ చేజింగ్ కొంత రొటిన్ గా అనిపించింది. కానీ కొన్ని వంశీ చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను మాత్రం మెచ్చుకొని తీరాలి. ప్రస్తుత రాజకీయ పార్టీల పై , హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో ఉన్న వాస్తవ పరిస్థితుల్ని, రెడ్ లైట్ ఏరియాలను జనాలకు చూపించి తన డేన్ నెస్ ని చాటుకున్నాడు. చాలా సినిమాల తరువాత నిద్రావస్థలో ఉన్న తన ప్రతిభను వెలికితేసే ప్రయత్నం చేశాడనిపిస్తుంది. అదే ఫ్లోను కొనసాగించింటే... పైసా చిత్రం పైసల వసూళ్ళలో కూడా బెస్ట్ అనిపించకుకునేది. ఇప్పుడు జనాలు ఆదరించే దాన్ని బట్టి ఈ సినిమా వసూళ్ళు ఉంటాయి.

Cinema Review

క్రియేటివ్ దర్శకుడు అయిన క్రిష్ణ వంశీ తన సినిమాల్లో నటించే హీరోల దగ్గరి నుండి వాల్సినంత నటనను రాబట్టుకోవడానికి పిండి పిప్పి చేస్తాడు. నటుడు ఎవరైనా సరే నటనను బాగా చేయించే ఆయన ఈ సినిమా లో నాని చేత ప్రకాష్ క్యారెక్టర్ ని బాగా చేయించాడు. ప్రకాష్ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రయినా తన స్టైల్ తో ఎక్స్ ప్రెషన్స్ తో బాగా ఆకట్టుకున్నాడు. ఇద్దరమ్మాయిల తరువాత ఈ సినిమాలో నటించిన కేథరిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. కానీ ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది.

ఇక చరణ్ రాజ్ పోషించిన పాత్ర అంతగా ఆకట్టులేదు. ఆ పాత్రలో పూర్తిగా తేలిపోయాడు. ఇదే పాత్రను ప్రకాష్ రాజ్ పోషించి ఉంటే రక్తి కట్టిందేమో అనిపిస్తుంది. సిద్ధికతో ‘మంచు లక్ష్మి’ ’ తో మా ట్లాడించారు. ఆమె క్యారెక్టర్‌ ఒకింత విసిగిస్తుంది. రాజా రవీంద్ర క్యారెక్టర్‌కి బిల్డప్‌ ఎక్కువ ఫెర్మార్మెన్స్ తక్కువ. కమేడియన్ వేణు కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా వారు వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

 

కళాకారుల పనితీరు :

 

ఈ సినిమాలోని పాటల కంటే సాయి కార్తీక్ అందించిన నేపధ్య సంగీతం , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. పాటలు వినకపోయినా తన నేపథ్య సంగీతం తో చాలా వరకు కవర్ చేశాడు. కానీ ఉన్న పాటలన్నీ సందర్బోచితంగా లేక పోయేసరికి  బోర్ కొట్టినట్లు అనిపిస్తున్నాయి.. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్లను పెట్టాల్సిన చోట పెడితే బాగుండేదనిపిస్తుంది. సంతోష్ రాయ్ కెమెరా పని తనం బాగున్నా కొన్ని సీన్స్ ని చాలా క్లోజప్స్ లో చూపించే సరికి రామ్ గోపాల్ వర్మ సినిమాలోని షాట్స్ గుర్తుకు వస్తాయి.

ఇక ఈ సినిమాకు దర్శకత్వం, డైలాగులు అన్నీ తానైన క్రిష్ణవంశీ కొన్ని సంభాషణతో ఆకట్టుకున్నాడు. కొన్ని డైలాగులు బాగా పేలాయి. ఇక ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో పాత క్రిష్ణ వంశీ ఇలా వచ్చి అలా వెళ్ళి పోయాడు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త బెటరే అనిపిస్తుంది. కానీ తనలో అంతర్గతంగా నిద్ర పోతున్న ట్యాలెంట్ పూర్తి స్థాయిలో బటయకు తీస్తే సినిమా ఆయన గత బ్లాక్ బస్టర్ సినిమాల్లా కాకపోయినా, వాటికంటే బెటర్ అవుట్ పుట్ వచ్చేది. పాటల చిత్రీకరణలో తనదైన మార్క్ ను చూపించే కృష్ణవంశీలో కూడా కొన్ని పాటల్లో ముద్రను చూపించాడు.