తెలంగాణ రాములమ్మగా పేరుతెచ్చుకొని, తెలంగాణ ఉద్యమానికి ఉడుత సహాయం చేసిన నటి విజయశాంతి. తెలంగాణ కోసం నా ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తానని శపథం చేసిన రాములమ్మ. తెలంగాణ తల్లి పార్టీ పెట్టుకొని, తెలంగాణ ప్రజలకు దగ్గరైన విజయశాంతి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవున్న తన పార్టీని కేసిఆర్ చేతిలో పెట్టి, ఆయనకు రెడిమెడ్ చెల్లెమ్మగా రాములమ్మ మారిపోయింది. రెడీమెడ్ చెల్లెమ్మ రాకతో కేసిఆర్ కు కొండ బలం వచ్చినట్లు మీడియా ముందు రంకేలు వేయటం జరిగింది. అయితే ఈ ఇద్దరి అన్న చెల్లెల్ల అనుబంధం కొన్ని సంవత్సరాలకే పరిమితమైన విషయం తెలిసిందే. రాఖీ పండగ ముందే.. కేసిఆర్ రాములమ్మ విడిపోయారు. అయితే కొత్తగా రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ హై జంప్ చేయటం జరిగింది. అయితే నిన్న ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా.. విజయశాంతి శుభాకాంక్షాలు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ సందర్భలోని .. సీఎంతో విజయశాంతి దాదాపు రెండు గంటల పాటు మంతనాలు సాగించి, సీఎం ఇచ్చిన తేనేటీ విందును ఆరగించి వెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే ఈ సమావేశంలో రాములమ్మ కేసిఆర్ తో కలిసి చేసిన రహస్య చిట్టా మొత్తం విప్పినట్లు సమాచారం. అంతేకాకుండా కేసిఆర్ చేసే ప్రతి పని వెనుక ఉన్న సీక్రెట్స్ ను బయటపెట్టిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఉద్యమం కోసం కేసిఆర్ తొక్కిన అడ్డదారులను, ఓయూ విద్యార్థుల జీవితాలతో కేసిఆర్ ఆడిన నాటకాలను, ఉద్యమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం కేసిఆరే అని రాములమ్మ సీఎంతో చెప్పినట్లు గాంధీ భవన్ లోని కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. కేసిఆర్ చిట్ట తెలుసుకున్న సీఎం త్వరలో ఢిల్లీ కి వెళ్ళాటానికి రెడీ అవుతున్నట్లు పార్టీలోని సినీయర్ నాయకులు అంటున్నారు. అయితే కేసిఆర్ పై ఉన్న పగను రాములమ్మ ఇప్పటి నుంచే తీర్చుకుంటుందని కాంగ్రెస్ నాయకులు చెవులుకొరుకుంటున్నారు. అయితే రెడీమెడ్ చెల్లెమ్మకు కేసిఆర్ అన్నయ్య ఎలాంటి షాకిస్తాడో చూడాలని కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more