అటు భక్తీ భావం ఒట్టిపడే సినిమాలు, సోషియో ఫ్యాంటసీ సినిమాలు, మాస్ ఎంటర్టైనర్లు, ప్రేమకధా సినిమాలు ... ఇలా తన వయస్సు తో నిమిత్తం లేకుండా, అన్ని తరహా సినిమాలు చేస్తూ అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటున్న హీరో నాగార్జున ... తన తనయుడికే కాదు, మిగితా యువ హీరోలందరికీ నాగ్ నుండి గట్టి పోటీయే ఉంది ... 'ఢమరుకం' తరువాత, నాగ్ సరికొత్త గెట్ అప్ లో మరింత యంగ్ గా తన తదుపరి సినిమా 'గ్రీకు వీరుడు' లో కనిపించబోతున్నాడు ... ఈ సినిమా టీసర్ నాగ్ పాత్ర యొక్క స్వభావాన్ని చాటి చెబుతోంది ... అమెరికా లో పుట్టి, పెరిగి, తెలుగు సాంప్రదాయాన్ని ఇష్టపడే, ప్రేమా - పెళ్లి మీద నమ్మకం లేని, ఎంతమంది నైనా ప్రేమించచ్చు అనే అబ్బాయి పాత్రలో నాగ్ ఈ సినిమా లో కనిపిస్తారు ... ఇలాంటి వ్యక్తికి పూర్తి విరుద్ధమైన భావాలు ఉన్న 'నయనతార' వంటి యువతి తారసపడితే ఎలా ఉంటుంది అనే కధాంశం తో, 'Mr. పర్ఫెక్ట్ ' విజయం తరువాత, నాగ్ తో 'సంతోషం' వంటి సినిమా కు దర్శకత్వం వహించిన దసరధ్ 'గ్రీకు వీరుడు' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు ...
వచ్చే నెల 19 న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అయ్యింది ... వేసవి కానుకగా ప్రేక్షకులను అలరించబోతోంది ... 'బంగారం' ఫేం మీరా చోప్రా ఈ చిత్రం లో ఇంకో కధానాయికగా కనిపిస్తోంది ... కామాక్షి మోవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందుతున్నాయి ... సినిమా తప్పక విజయం సాధిస్తుంది అంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు ...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more