ప్రజల రక్షణ కోరే పోలీసు లే ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. అక్రమా గంజాయి కోసం రోడ్డున పడి కొట్టుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు గంజాయి స్మగ్లర్లతో సంబంధాలున్నాయని ఆరోపించిన రంపచోడవరం ఏఎస్పీ నవీన్‌కుమార్ తీరును హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తప్పు పట్టారు. క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖ పరువు తీసేలా ఏఎస్పీ ప్రవర్తించడం సరికాదన్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా వీధికెక్కడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఒక వ్యక్తి వల్ల వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలగకూడదన్నారు. ఈ వ్యవహారంపై నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎస్పీ త్రివిక్రమవర్మ గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపారని, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఏఎస్పీ నవీన్‌కుమార్ ఆరోపణలపై ఏలూరు రేంజి డీఐజీ సూర్యప్రకాశరావు విచారణ పూర్తి చేసి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. ఆ నివేదిక హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిలకు చేరాల్సి ఉంది. ఏఎస్పీ తన ఆరోపణలకు సాక్ష్యాలు చూపించలేకపోవడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పోలీసు వర్గాలు కూడా అలాగే అభిప్రాయపడుతున్నాయి. ఏఎస్పీతోపాటు కిందిస్థాయి సిబ్బందిపైనా వేటుపడే అవకాశాలున్నాయంటున్నారు. జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మ ఆయన డ్రైవర్ ద్వారా గంజాయి స్మగ్లర్ల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారని, అడ్డుపడుతున్న తనపై హత్యాయత్నం చేయించారని కొద్దిరోజుల క్రిత తీవ్ర ఆరోపణలు చేసి, సంచలనం రేపిన రంపచోడవరం ఏఎస్పీ నవీన్‌కుమార్ అంతకన్నా తీవ్రస్థాయి ఆరోపణ చేశారు.
జిల్లా ఏజెన్సీలో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్‌లో డీజీ స్థాయి అధికారికి వాటాలున్నాయని ఆరోపించారు. ఎస్పీమీద నవీన్‌కుమార్ చేసిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిన ఏలూరు రేంజి డీఐజీ సూర్యప్రకాశరావు నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. అయితే ఏఎస్పీ నోటిమాట తప్ప ఆరోపణలకు ఆధారాలను ఇవ్వలేదని డీఐజీ అంతకుముందే విలేకరులకు చెప్పారు. దీంతో ఏఎస్పీ రాజమండ్రిలోని ఓ హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. విచారణాధికారి ఆవిధంగా మాట్లాడటంతో ఆయన నివేదికపై తనకు నమ్మకం సడలిందన్నారు. వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీలో ఏటా వందల కోట్ల గంజాయి వ్యాపారం జరుగుతోందని, దానిలో డీజీ స్థాయి వ్యక్తికి వాటాలున్నట్టు తెలుస్తోందన్నారు. పెద్దల ప్రమేయం ఉండటంతో డీఐజీ ఏకపక్షంగా విచారణ జరిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐ లేదా ఆరుగురు సభ్యులు గల థర్డ్ పార్టీ కమిటీతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణలతో న్యాయం జరగని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని ఏఎస్పీ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more