హైదరాబాద్ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ సేవలు జగద్విదితం. అయితే, 'వెరీ వెరీ స్పెషల్' ఇన్నింగ్స్‌లు ఇక ఎంతో కాలం చూడలేమా? 38 ఏళ్ల లక్ష్మణ్ కెరీర్ చరమాంకంలో పడిందా? న్యూజిలాండ్‌తో సిరీసే చివరిదా? సొంతగడ్డపై వీవీఎస్ అంతర్జాతీయ క్రికెట్‌కు ఘనమైన వీడ్కోలు పలకనున్నాడా? ప్రస్తుతం అభిమానులు, క్రీడా పండితుల మధ్య ఇదే చర్చ.భారత బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్.. న్యూ జిలాండ్‌తో రెండు టెస్టుల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నాడు. ఈ హైదరాబాదీ తన నిర్ణయాన్ని నేడోరేపో వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై బీసీసీఐ, హెచ్‌సీఏ నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదు. వీవీఎస్ తన 16 ఏళ్ల కెరీర్‌లో 134 టెస్టులు ఆడాడు. తన ఫామ్‌ను, వయసును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం కోసం లక్ష్మణ్ రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి.కివీస్‌తో తొలి టెస్టు సొంతగడ్డపై జరగనుండటంతో వైదొలగడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు సమాచారం.
ఈ విషయంపై కుటుంబ సభ్యులు, సన్నిహితులతో లక్ష్మణ్ చర్చిస్తున్నాడు. టెస్టు క్రికెట్లో భారత్‌కు చిరస్మరణీయ విజయాలు అందించిన హైదరాబాదీ 83 వన్డేల్లో ఆడాడు. ఆరు శతకాలతో 2,338 పరుగులు చేశాడు. కాగా ప్రపంచ కప్‌లో ఆడకపోవడం అతని కెరీర్‌లో లోటే. లక్ష్మణ్ వీడ్కోలు పలికితే అతని సమకాలీనుల్లో గంగూలీ, కుంబ్లే, ద్రావిడ్ తర్వాత జట్టులో మిగిలే ఏకైక దిగ్గజం సచిన్ మాత్రమే.సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్.. అభిమానులు గౌరవంగా పిలుచుకునే భారత 'బ్యాటింగ్ త్రయం'. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. ఒక్కో ప్రత్యేకత. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో టీమిండియా నెంబర్‌వన్ కిరీటం అందుకోవడంతో వీరి ముగ్గురిదీ కీలక పాత్ర. అయితే, గతేడాది ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో వరుస దారుణ పరాజయాలు.. అగ్రస్థానం కోల్పోవడం.. భారత క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపేసింది. జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ త్రయానికీ విమర్శలు తప్పలేదు. క్లాస్ ఇన్నింగ్స్‌తో సెంచరీల మోత మోగించే సచిన్.. సాంకేతికతలో తనకు తానే సాటి అయిన 'ది వాల్' ద్రావిడ్.. క్లిష్ట సమయాల్లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడే 'వెరీ వెరీ స్పెషల్' లక్ష్మణ్.. ముగ్గురూ జట్టును ఆదుకోలేకపోయారు. ఆసీస్ పర్యటన అనంతరం ద్రావిడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఆసీస్‌పై ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో వీవీఎస్ కేవలం 154 పరుగులే చేశాడు. దీంతో తర్వాతి వంతు లక్ష్మణ్‌దేనన్న చర్చ అప్పుడే మొదలైంది. అయితే, టీమిండియా టెస్టు సిరీస్‌లకు సుదీర్ఘ విరామం ఉండటంతో ఆ విషయానికి తెరపడింది. తాజాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టులకు జట్టు ఎంపిక సందర్భంగా వీవీఎస్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. లక్ష్మణ్‌కు చోటు విషయంపై సందేహాలు వ్యక్తమయినా సెలెక్టర్లు అవకాశమిచ్చారు. ఏడాదిగా ఈ హైదరాబాదీ ఫామ్‌లో లేకపోవడం.. కొత్త కుర్రాళ్లు చోటు కోసం క్యూలో ఉండటం అతనిపై ఒత్తిడి పెంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయమని వీవీఎస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కివీస్‌తో తొలి టెస్టు సొంతగడ్డపైనే జరగనుండటంతో గౌరవప్రదంగా వైదొలగాలని నిర్ణయించినట్టు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more