మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఒక వార్త ఫిలిం నగర్ లో ఇప్పుడు చెక్కర్లు కొడుతుంది. ఇందులో నిజమెంతో తెలియదు కానీ దీని పై సినీ జనాలు మాత్రం హాట్ హాట్ గా చర్చించుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు అంటే తెలియని వారు ఉండరు. మెగా స్టార్ తమ్ముడిగానే కాకుండా, వెండితెర పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా మంచి పేరు తెచ్చకున్నాడు. నాగబాబుకి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తె వివాహాం చేయడానికి నాగబాబు ప్రయత్నాలు మొదలు పెట్టాడని వార్తలు. మరి ఇంతకీ మెగా ఫ్యామిలీలో అల్లుడిగా అడుగుపెట్టబోయేదెవరు ? గతంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె నిశ్చితార్థం అయిన తరువాత ఆగిపోయింది. కారణాలు ఏవైనా చిరంజీవికి ఓ విధంగా అవమానమే అని చెప్పవచ్చు.
పెళ్లిళ్ళు స్వర్వంలో నిర్ణయించబడతాయి అంటారు పెద్దలు. ఓ సినీ కవి అయితే.. ఏనాడో ఏ జంటకో రాసి ఉంచాడు విధి ఎప్పుడో అని అన్నాడు. ఏ అబ్బాయికి... ఏ అమ్మాయికి పెళ్ళి ఫిక్స్ అవుతుందో చెప్పలేం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నాగబాబు కుమార్తెని ఓ తెలుగు హీరోకి ఇచ్చి చేయడానికి ఇరువర్గాల కుటుంబాలు సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే... నవతరం నటుడు నవదీప్. నవదీప్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన కాపు వర్గానికి చెందిన వాడుకావడం ఒక కారణం అయితే, మంచి హ్యాండ్ సమ్ గా ఉండటం మరో కారణం అని అంటున్నారు. నవదీప్ సొంతంగా కష్టపడి హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలు చేస్తూ, బుల్లితెర పై కూడా రాణిస్తున్నాడు. నవదీప్ కెరీర్ గ్రాఫ్ ఓ మోస్తరు చెప్పుకోదగ్గ ఉన్నా, అతని క్యారెక్టర్ గ్రాఫ్ మాత్రం అందరికీ తెలిసిందే. గతంలో ఇతడు తప్పతాగి రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసినందుకు పోలీసులు ఇతనికి ఫైన్ కూడా వేశారు.
గతంలో ఓ హీరోతో జరిగిన సంఘటనను గుర్తుకుతెచ్చుకున్న మెగా ఫ్యామిలీ మళ్లీ హీరోనే అల్లుడిగా తెచ్చుకోవడానికి వెనకడుగు వేస్తుందని భావించారు. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి వాడితో పెళ్ళికి సిద్ధమయ్యారని తెలుసుకున్నవారు నమ్మడం లేదు. ఎవరూ నమ్మినా నమ్మక పోయినా మెగా ఫ్యామిలీకి అల్లుడిగా వెళితే నవదీప్ జీవితం జిల్ జిల్ జిగా... అవుతుందని సినీ జనాలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more