చెన్నయ్ పారదర్శకంగా పాలన అందించడమే లక్ష్యమని చెబుతున్న ముఖ్యమంత్రి జయలలిత.. ఆ దిశగా అడుగులు వేయని మంత్రులపై కొరడా ఝళిపిస్తున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని మంత్రులు హడలిపోతున్నారు. అవినీతి రహిత, పారదర్శకమైన, ప్రజలకు అనువైన పాలనను అందిస్తామని మూడోమారు ముఖ్యమంత్రి పీఠమెక్కినప్పుడే ప్రకటించిన జయలలిత ఆ దిశగా గట్టి చర్యలు తీసుకున్నారు. అవినీతి రికార్డు, ధిక్కార స్వరం, స్వప్రయోజనాల కోసం పాకులాడే వ్యక్తుల్ని మంత్రివర్గంలోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆమె ఆదిలోనే తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే కొంతమంది సీనియర్ నేతల్ని కూడా ఆమె తొలి మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కనబెట్టారు. ఇందులో స్పీకర్ డి.జయకుమార్, వళర్మతి వంటి నేతలు కూడా వున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. జయకుమార్, వళర్మతి గత డీఎంకే ప్రభుత్వ హయాంలో పార్టీ పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినట్టు వార్తలు వెలువడ్డాయి. అందుకే జయకుమార్‌ను స్పీకర్ పదవిలో పెట్టిన జయ, వళర్మతిని ఆదిలో మంత్రివర్గానికి దూరంగా పెట్టారు. అయితే ఆ తరువాత వళర్మతి ఇచ్చిన వివరణతో ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక ప్రజలకు చేరువవ్వాలని కూడా జయ మంత్రులకు తరచుగా చెబుతున్నారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో విపరీతమైన అవినీతి జరిగినట్టు భావిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం తమ పార్టీ నేతలు కూడా సాధ్యమైనంతగా దానికి దూరంగా వుండాలని సూచిస్తున్నారు. అయితే కొంతమంది మంత్రులు ఇవేవీ పట్టించుకోకుండా చేతివాటం ప్రదర్శిస్తుండడంతో వారిపై జయ వేటు వేస్తున్నట్టు సమాచారం.
ఆది నుంచి పార్టీకి విశ్వాసపాత్రునిగా వున్న సెంగోట్టయ్యన్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు తన మాటను ఖాతరు చేయడం లేదని జయ ఆగ్రహంతో వున్నట్టు సమాచారం. తనకు తెలియకుండానే పార్టీలో, ప్రధాన కార్యాలయంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటి గురించి జయకు సమాచారం కూడా ఇవ్వడం లేదన్నది పార్టీ వర్గాల్లో ఆయనపై వున్న ఆరోపణ. ఇక రెవెన్యూశాఖలో జయ సూచించిన విధంగా పనులు జరగడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఒకటి చెబితే సెంగోట్టయ్యన్ మరొకటి చేస్తున్నారని, దీనిపట్ల అధికారులే సీఎం వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. అందుకే సెంగోట్టయ్యన్‌ను తొలగించినట్టు తెలుస్తోంది. ఇక తిరుచ్చి పశ్చిమం నియోజకవర్గ ఎమ్మెల్యే పరంజ్యోతిపై కూడా రెండు వివాహాల ఆరోపణలు రావడంతో తక్షణమే ఆయన్ని తొలగించారు. మంత్రి పదవిలో వున్న సైదాపేట ఎమ్మెల్యే సెంథమిళన్‌ను కూడా ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం వల్లనే వేటు వేశారు. తద్వారా తప్పులు చేస్తే ఉపేక్షించేది లేదని మంత్రులకు సీఎం హెచ్చరికలు చేస్తున్నారు. దడ మొదలైంది సీఎం చర్యలతో మంత్రులు బిక్కచచ్చిపోతున్నారు. సీఎంకు తెలియదన్న ఉద్దేశంతో ఇప్పటికే చేతివాటం చూపిన మంత్రులు.. తమ పదవి గురించి ఏ క్షణంలో ఏం వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు త్వరలోనే మరో ముగ్గురు నలుగురిపై వేటు తప్పదని వస్తున్న వార్తలతో వారు ఆ జాబితాలో తమ పేరేమైనా వుందేమోనని వాకబు చేస్తున్నారు. గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు వచ్చిన మంత్రుల ముఖాలపై చిరునవ్వే కరువైంది. చాలా రోజుల తరువాత పార్టీ అధినేత్రి కొడనాడుకు వచ్చారన్న సంతోషం కన్నా, ఆమె కార్యాలయం నుంచి ఎలాంటి వార్త వెలువడుతుందోనన్న బెంగే అధికంగా కనిపించింది. ఇక ఉద్వాసన పలికే జాబితాలో పేర్లు వినవస్తున్న మంత్రులైతే... క్షణాలు లెక్కబెట్టుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more