ఈ ఇద్దర మహా ముదుర్లు. పైకి ఒకేలా కనిపించిన మహా మేథావులు. ఈ ఇద్దరు ఒకప్పుడు మంచి మిత్రులు.. ఇప్పుడు శత్రువులు ఉన్నారు. అదీ పదవుల కోసం విడిపోయిన నాయకులుగా చరిత్రలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే సరికొత్తగా ఒకరి కౌగిలిలో మరొకరు చిక్కుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఇరకాటంలో పెట్టినట్లే. తెలంగాణ అంశంపైనే కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పడం ద్వారా కెసిఆర్ తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రణబ్ ముఖర్జీని తెలంగాణ వ్యతిరేకిగా పరిగణిస్తూ ఓటు వేయకూడదనే పార్టీ తెలంగాణ ఫోరం చేసిన విజ్ఞప్తికి చంద్రబాబు తలొగ్గినట్లు తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ చెప్పారు.
కాంగ్రెసు వ్యతిరేకత పేరు మీద కాకుండా ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ వ్యతిరేకి అంటూ ఓటింగుకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండడం ద్వారా తెలంగాణ అనుకూల వైఖరిని చంద్రబాబు ప్రదర్శించారని చెప్పడానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులకు అవకాశం చిక్కింది. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలంగాణ వస్తుందని కెసిఆర్ కు కొద్ది కాలంగా నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసేందుకే కెసిఆర్ ఈ వాదనను ముందుకు తెచ్చారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత తెలంగాణ ఏర్పాటు కాకపోతే మళ్లీ కాంగ్రెసును దుమ్మెత్తిపోయడం ద్వారా సమస్యను అధిగమించే యోచనలో కెసిఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. కెసిఆర్ ప్రయత్నాలను చంద్రబాబు తన వ్యూహం ద్వారా తిప్పికొట్టారని భావిస్తున్నారు. తెలంగాణ అంశంపైనే రాష్ట్రపతి ఎన్నికలకు తాము దూరంగా ఉంటే, కెసిఆర్ ప్రణబ్ ముఖర్జీకి ఓటేస్తే తాము అవకాశంగా తీసుకోవచ్చుననే వ్యూహాన్ని చంద్రబాబు పన్నినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో కెసిఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటేయడం అంత సులభమైన విషయంగా కనిపించడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన నిర్ణయాన్ని కెసిఆర్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రణబ్ ముఖర్జీకి ఓటేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యతిరేకత కారణంగానే వైయస్ జగన్ ప్రణబ్ ముఖర్జీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించడానికి చంద్రబాబు నిర్ణయం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులకు అవకాశం లభించబోతోందని అంటున్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెరాస ఒక తాను ముక్కలేనని చెప్పడానికి తగిన పరిస్థితిని చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నికల ద్వారా కల్పించబోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more