రాష్ట్రపతి ఎన్నిక తర్వాత తెలంగాణ వస్తుందనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాటలు ఉత్తవేనని అంటున్నారు కొంత మంది తెలంగాణ నాయకులు . ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, ఇందుకు సంబంధించి తనకు సంకేతాలు అందాయని ఆయన ఈ మధ్య కాలంలో ప్రతి సభలోనూ చెప్పటం పై తెలంగాణ నాయకులు మండిపడుతున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే, నిజంగానే కెసిఆర్‌కు అటువంటి సంకేతాలు అందాయా అనేది అనుమానంగానే ఉందని వారు అంటున్నారు. కాంగ్రెసు అధిష్టానం అసలు తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కునే దిశగా ఆలోచన చేస్తోందా, రాష్ట్రపతి ఎన్నిక కోసం అటువంటి సంకేతాలు ఇచ్చినట్లు నటించిందా అనేది ప్రశ్నార్థకంగా ఉందని తెలంగాణ సీనియర్ నాయకులు అంటున్నారు.కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ మాటలు చూస్తుంటే అటువంటి సంకేతాలేవీ లేవని అర్థమవుతోంది. తెలంగాణపై తమ పార్టీ అధిష్టానం నాన్చుడు ధోరణిని మాత్రమే అవలంబిస్తోందని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తప్ప తెలంగాణ వచ్చే అవకాశాలు లేవని ఆయన చెబుతున్నారు.కెసిఆర్ చెప్పినట్లు కాంగ్రెసు అధిష్టానంపై తెలంగాణ మీద ఏ విధమైన సంకేతాలు లేవని సీపీఐ నాయకులు కూడా అంటున్నారని టీ నాయకులు అంటున్నారు.
ఇదే సమయంలో తమకు తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదని, అయితే తెలంగాణ వచ్చే అవకాశాలు లేవని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాదనే విషయాన్ని సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా అన్నారు. సీమాంధ్ర నాయకులంతా ఆ ధీమాతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. తెలంగాణ వస్తున్నట్లు తనకు సంకేతాలు అందాయని కెసిఆర్ చెప్పడంలోని ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. నిజానికి, కెసిఆర్ ఇటువంటి ప్రకటనల వల్ల తెలంగాణ ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదం ఉంది. కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సిద్ధపడుతుందని ఎవరూ ఇప్పుడు విశ్వసించడం లేదు. సమస్యను నాన్చడం ద్వారా ఎప్పటికప్పుడు తన పనులను కానిచ్చుకోవడమే ధ్యేయంగా ఆ పార్టీ పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ అంశం ఎజెండాగా మారకుండా చూసేందుకే కెసిఆర్‌కు ఏమైనా అటువంటి సంకేతాలు ఇచ్చిందా, కెసిఆర్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు అలాంటి వ్యవహారాన్ని నడిపిందా తెలియదు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస మధ్దతు పొందడానికి కూడా కాంగ్రెసు అధిష్టానం అటువంటి ఎత్తుగడను అనుసరించి ఉండవచ్చు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెసుకు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాటలేం చెప్పినా వైయస్ జగన్ తెలంగాణకు వ్యతిరేకంగానే ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి స్థితిలో కెసిఆర్ తెలంగాణ వస్తుందంటూ చేసిన ప్రకటనలు అంత నమ్మశక్యంగా కనిపించడం లేదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more