మన రాజకీయ నాయకులు ఎప్పుడు ఎవరిని ఎలా ఉపయోగించుకుంటారో వారికే తెలియదు. రాజకీయ పదవుల కోసం తమ కుటుంబం సభ్యులను సైతం రంగంలోకి దించుతున్న రోజులివి. ఇప్పుడు ఏకంగా ఒక రాజకీయ నాయకుడు తనపై పడిన నిందను తొలగించుకోవటానికి ..తన కుమార్తెలను రంగంలోకి దించాడు. ఎమ్మెల్యే సొంత కూతుర్ల మీదనే ప్రమాణం చెయ్యటానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. జగన్ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన కుమార్తెలు కనకదుర్గ, విజయదుర్గ లపై ప్రమాణం చేస్తానని గుడివాడ టిడిపి ఎమ్మెల్యే కొడాలి నాని సవాల్ చేశారు. టిడిపి నాయకుడు దేవినేని ఉమా, తనపై ముప్పై కోట్ల ఆరోపణలు చేశారని, తనకు డబ్బులు ఇప్పించిన బ్రోకర్ ఎవరో చెప్పాలని,తనకు డబ్బు ఇచ్చినట్లు ఉమ ప్రమాణం చేయడానికి సిద్దమా అని నాని ప్రశ్నించారు.ఉమామహేశ్వరరావు తమ్ముడు కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రస్ లో చేరారని, ఆయనకు ఎంత ముట్టిందో ఉమ చెప్పాలని నాని డిమాండ్ చేశారు
.తనపై దాడులు చేయాలనడం చంద్రబాబు చీప్ ట్రిక్ లని, గతంలో ఎన్.టి.ఆర్ పై చెప్పులు వేయించారని ఆయన విమర్శించారు. చంద్రబాబు రెండు ఎకరాల నుంచి ఇరవై వేల ఎకరాలు ఎలా సంపాదించారని, సింగపూర్, మలేషియాలలో హోటళ్లు ఎలా కట్టారని, ఈయన నీతిమంతుడా అని జనం అనుకుంటున్నారని నాని అన్నారు.తనకు చంద్రబాబు, తనను తిట్టిన కుక్కలు క్షమాపణ చెప్పించాలని నాని డిమాండ్ చేశారు.తాను ఎక్కడా టిడిపిని వదలుతానని చెప్పలేదని, తనను ఎన్.టి.ఆర్. మాదిరి బయటకు గెంటించి వేశారని ఆయన అన్నారు.చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వారి పెళ్లిళ్లకు వెళ్లడం లేదా? అది ఆయన వ్యక్తిగత సంబందాలు కొనసాగించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.రాజకీయాల నుంచి పోనని, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. జగన్ నెంబర్ ఒన్ వ్యక్తి , రేపు అదికారంలోకి రావడానికి సిద్దంగా ఉన్న వ్యక్తితో కలిసి పని చేయడానికి సిద్దమన్నారు.చద్రబాబు టిఆర్ఎస్, సిపిఐ, బిజెపిలకు కూడా గతంలో వెన్నుపోటు పొడిచాడని, టిఆర్ఎస్ వారు సొంతంగా పోటీచేసి ఉంటే వారికి ముప్పై సీట్లు వచ్చేవని,చంద్రబాబు బొమ్మ పెట్టుకుని వారు దెబ్బతిన్నారని నాని విమర్శించారు.ఎన్.టి.ఆర్.కుటుంబంతో తాను వ్యక్తిగత సంబందాలు కొనసాగిస్తానని అన్నారు.ఎన్.టి.ఆర్.మాదిరి రాజశేఖరరెడ్డి కూడా బడుగు వర్గాలకు పధకాలు అమలు చేసిన వ్యక్తి అని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more