నేను యాక్టర్ కాకపోతే .. తప్పకుండా డాక్టర్ అయ్యేదానిని అని చాలా మంది చెబుతుంటారు. ఇప్పుడు అలాంటి వారిలో మన క్రీడాకారిణి కూడా చేరింది. బాడ్మింటన్‌లో మెరుపులు మెరిపిస్తున్న హైదరాబాదీ క్రీడాకారణి సైనా నెహ్వాల్ కరాటే నిపుణురాలు అయి ఉండేవారే. అయితే, బాడ్మింటన్ కోసం ఆమె కరాటేను వదిలేశారు. లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్న సైనా విషయాన్ని ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో చెప్పారు. హైదరాబాదులో ఇంద్రసేనా రెడ్డి నెలకు వంద రూపాయలు చెల్చించి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది.ఆమె కరాటే కోచింద్ అర్థాంతరంగా నిలిచిపోయింది. ఇన్స్ట్రక్టర్ విద్యార్థుల చేతుల మీంచి మోటార్ బైక్ నడిపించడానికి సిద్ధపడడంతో ఆమె కరాటే శిక్షణ నిలిచిపోయింది. "సైనా నెహ్వాల్: స్ఫూర్తిదాయకమైన జీవితకథ" అనే పేరుతో టి. సుధీర్ అనే జర్నలిస్టు రాసిన పుస్తకంలో ఆ విషయం చెప్పారు.
చేతుల మీంచి బైక్ నడిపించడానికి సైనా తల్లిదండ్రులు ఇష్టపడలేదు. ఆమెను వారు వెంటనే అక్కడి నుంచి తప్పించేశారు. కరాటేలో నష్టపోయింది సైనా బాడ్మింటన్‌లో పొందారు. శాకాహారం మాత్రమే తీసుకునే కుటుంబంలో జన్మించిన సైనా చైనాలో ఉన్నప్పుడు 2005లో మాంసాహారిగా మారిపోయారు. రెస్టారెంట్లో శాకాహారం లభించకపోవడంతో చేపలు, పీతలు తినాలని సూచించినట్లు ఆమె కోచ్ గోపిచంద్ చెప్పారు.మాంసాహారం భుజించాలని చెప్పినప్పుడు సైనా ఏ మాత్రం వాదించలేదట. దీనికి తాను ఆశ్చర్యపోయానని గోపిచంద్ అన్నారు. మారు మాట్లాడకుండా మాంసాహారం తినేసిందట. ఇప్పటికీ తనకు మాంసాహారం అంటే ఇష్టం లేదని సైనా ఆ పుస్తకంలో చెప్పింది. చేపలు, మేకమాంసం కాకుండా చికెన్ తింటుందట. రజ్మా, దాల్, రోటీ మాత్రమే ఎక్కువగా తింటుంది. సైనా తన టీన్స్‌లో బాడ్మింటన్ కోచింద్ కోసం ప్రతి రోజు 25 కిలోమీటర్ల దూరం వెళ్లేదని ఆ పుస్తకంలో చెప్పారు. ఉదయం 4 గంటలకు లేచి, తండ్రి స్కూటర్ మీద వెళ్లేది. నిద్రతో ఆమె తండ్రి వెనక సీటు మీద జోగుతూ ఉండేది. 2000 మార్చిలో ఆమె కోసం కారు కొన్నారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్)లో ఉద్యోగం చేసే హర్వీర్ సింగ్‌కు నెలకు 12 వేల రూపాయల జీతం వచ్చేది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more