చరణ్, ఉపాసనల వివాహం ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి పెళ్లి కూతురు ఉపాసన సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ వస్తారని ఆశించింది. ఎందుకంటే ఆమెకు షారూఖ్ ఖాన్ అంటే విపరీతమైన అభిమానం. డిడెఎల్ జె సినిమా రిలీజైన నాటి నుంచి ఆమె ఆ స్టార్ వీరాభిమానిగా మారిపోయింది. దాంతో ఆమె షారూఖ్ తన పెళ్లికి వస్తే బావుంటుందని భావించింది. ఆమె చెర్రీని తమ పెళ్లికి షారూఖ్ ని ఆహ్వానించమని అడిగింది. ఈ విషయమై రామ్ చరణ్ ఓ ఇంగ్లీష్ లీడింగ్ పేపర్ తో మాట్లాడుతూ...ఉపాసన..షారూఖ్ కి పెధ్ద ప్యాన్ అని కన్ఫర్మ్ చేసారు. అలాగే తాను షారూఖ్ ని తమ పెళ్లికి ఆహ్వానించానని తెలిపారు. అంతేగాక బాద్షా తమ పెళ్లికి రావటం ఉపాసనకు తానిచ్చే పెళ్లి గిప్ట్ గా భావిస్తున్నాని చెప్పారు. అలాగే ఉపాసన మనస్సులో మాట ను షారూఖ్ కి తెలియచేసారు. అయితే షారూఖ్ వివాహానికి రాలేదు.
ఇక షారూఖ్ ప్రస్తుతం చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నారు. వస్తే సాయింత్రం రిసెప్షన్ కి రావచ్చని భావిస్తున్నారు. రాంచరణ్, ఉపాసనల వివాహానికి ఇరువురి బంధువులతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినీ రంగం నుంచి అమితాబచ్చన్, రజనీకాంత్, శ్రీదేవి-బోణికపూర్, అంబరీష్, మోహన్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, డి.రామానాయుడు, దాసరి, వెంకటేష్, శ్రీకాంత్, బ్రహ్మానందం, మురళీమోహన్, సుమలత, టీఎస్సార్, బోయపాటి, రాణా, విష్ణు, ఆహుతీప్రసాద్, వేణుమాధవ్, ఉత్తేజ్, శ్రీనువైట్ల తదితరులు హాజరయ్యారు.రాష్టగ్రవర్నర్ నరసింహన్ దంపతులు, తమిళనాడు గవర్నర్ రోశయ్య, సీఎం కిరణ్‌కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబుఐ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, పొన్నాల, రఘువీరారెడ్డి, జానారెడ్డి, శ్రీదేవి, బోనీకపూర్ దంపతులు వివాహ వేడుకలకు హాజరయారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని టెంపుల్ ట్రీ ఫాంహౌస్‌లో భారీ వివాహ వేదికపై వివాహం కన్నులపండుగగా జరిగింది. ఈ వేడుకలను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వివాహ వేడుకకు వచ్చిన అతిథులను చిరంజీవి, అల్లు అరవింద్ దగ్గరుండి ఆహ్వానించారు. ఇక వేదిక దగ్గర నాగబాబు, పవన్ కళ్యాణ్, బన్నీల హడావుడి ఎక్కువగా కనిపించింది. పెళ్లికి రెండుమూడ్రోజుల ముందు నుంచే రోజుకో కార్యక్రమాన్ని చేపట్టిన వధూవరుల కుటుంబాలు ... పెళ్లిని కూడా కనివినీ ఎరగని రీతిలో జరిపించాయి. వివాహ వేడుక ఇంకా కొనసాగుతోంది. పెళ్లి మండపం వద్ద టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ సినీ తారల సందడి కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more