అసలు ఉప ఎన్నికలు ఎందుకు జరుగుతాయి? ఉప ఎన్నికలు ఎలా వస్తాయి? ఎవరి వల్ల వస్తాయి? ఎప్పుడు వస్తాయి ? ఈ ఉప ఎన్నికల వలన ఎవరికి లాభం, ? ఉప ఎన్నికలతో కొత్తగా ఏం సాధిస్తారు? అని ఎవరైన అడిగితే .. సమధానం చెప్పటం చాలా కష్టం. అదీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు అయితే వీటిని మేము ఖండిస్తున్నాం అనే మాట తప్పితే.. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి వారిది. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉప ఎన్నికలు జరుపుకుంటున్నారు. ఎన్నికలనేది రాజకీయ నాయకులకు ఒక పండుగ మాదిరిగా మారిపోయింది. కన్ను మూసి తెరిసే లోపు .. రాజీనామాలు చేయటం, ఉప ఎన్నికలకు రెఢి కావటం.. అన్నీ క్షణల్లో జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 64 ఉప ఎన్నికలు జరిగాయి . ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఒక రాజకీయ నాయకుడు,( ఒక ఎంపి గానీ, ఒక ఎమ్మెల్యే గానీ ,) మరణిస్తే గానీ ఉప ఎన్నికలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు ఉదయం రాజీనామ చేసి.. సాయంత్రానికి ఎన్నికలకు రెఢి అయిపోయే హైస్పీడ్ యుగం వచ్చింది. ఈ ఉప ఎన్నికల వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఈ ఉప ఎన్నికల పద్దతిని ప్రవేశ పెట్టిన నాయకుడు కేసిఆర్ . ఆయన వలన రాష్ట్ర రాజకీయ వ్యవస్థ పూర్తి మారిపోయింది. తెలంగాణ కోసం రాజకీయ నాయకులను రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల ఫ్యాషన్ తెచ్చిన ఘనత కేసిఆర్ కే దక్కింది. ఆయన తెచ్చిన ఉప ఎన్నికల ఫ్యాషన్ తో రాజకీయ నాయకులందరికి పాకింది. దీంతో ప్రతి ఒక్కరు ‘రాజీనామా’ అనే సూత్రం ఉపయోగించి .. ఉప ఎన్నికలకు స్వాగతం పలుకుతున్నారు. ఈ ఉప ఎన్నికల వలన ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి రాజకీయ నాయకులు, ఆలోచించారా? ఈ ఉప ఎన్నికలను నిర్వహించటానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? ఎలా వస్తుంది? ఎవరు ఇస్తున్నారు? ఎన్నికల ఖర్చు మొత్తం ప్రజలే భరిస్తున్నారు. ఉప ఎన్నికలు జరగటం రాజకీయ నాయకులకు మేలు జరుగుతుందేమో గానీ , రాష్ట్ర ప్రజలకు మాత్రం కష్టాలు పెరుగుతాయాని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఉప ఎన్నికల్లో పెట్టే డబ్బుతో కొన్ని గ్రామాలను అభివ్రుద్ది చేయవచ్చునని రాజకీయ మేథావులు అంటున్నారు. స్కూలు, లైబర్రీలు, పేద విద్యార్థులకు ఉచిత లాంటి సౌకర్యలు కల్పించవచ్చనని మేథావులు అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో దొరికిన అవినీతి డబ్బు అక్షరాల 42 కోట్లు దాటిందని ఎన్నికల సంఘం అంటుంది. అదీ కేవలం 18 నియోజక వర్గాల ఎన్నికల్లో దొరికిన డబ్బు మాత్రమేనని అంటుంది. ఈ 42 కోట్లలను 18 నియోజక వర్గాలలో పంచితే.. ఒక్కోక్క నియోజక వర్గానికి 2.5 కోట్లు చొప్పున వస్తుందని రాజకీయ మేథావులు అంటున్నారు. అవినీతి గా సంపాదించిన డబ్బును ఎన్నికల్లో విచ్చల విడిగా ఖర్చు పెడుతున్నారు. ఏకంగా మందు రూపంలో ప్రజలను మభ్యపెట్టి , వారిని లోబరుచుకొని ఓట్లు దండుకుంటున్నారని మేథావులు సంఘాలు అంటున్నాయి. ఆడవారికైతే .. బంగారు , వెండి ఆభరణాలు ఇచ్చి వారిని తమవైపు తిప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ ఉప ఎన్నికల్లో అవినీతి సొమ్ము ఏరులై పారుతుందని మీడియా వర్గాలు అంటున్నాయి . ఇలా చేయటం వలన ప్రజా వ్యవస్థ చాలా దెబ్బతింటుందని మేథావులు అంటున్నారు.
అవినీతి సొమ్మును ఇలా చెయ్యటంపై కొంత మంది ఆందోళన చెందుతున్నారు. ఈ పెట్టిన డబ్బును రేపు ప్రజల నుండే వసూల్ చేస్తారని మేథావులు అంటున్నారు. ఏదో ఒక పన్ను రూపంలో ప్రజల పై భారం ముక్కుపిండి వసూల్ చేసుకుంటారని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరికొంత మంది ఇలా పంచటం పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగానైన రాజకీయ నాయకులు అక్రమాంగా సంపాదించిన నల్ల ధనం ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టడం ఎంతో మంచిదని అంటున్నారు. ఈ నల్ల ధనమే అని ఊరుకుంటే.. ఎలా ప్రజా స్వామ్యం అపహస్యం అయిపోతుందని మేథావులు అంటున్నారు. ఎందుకంటే.. ఉప ఎన్నికల్లో ఒక రాజకీయ నాయకుడు 10 కోట్లు ఖర్చు పెడితే.. రేపు గెలిచిన తరువాత .. 1000 కోట్లు సంపాదించుకుంటాడని సీనియర్ రాజకీయ మేథావులు అంటున్నారు. ఇలాంటి వ్యవస్థను నిర్ములించకపోతే.. రాబోయే రోజుల్లో .. ప్రజా స్వామ్య వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇలాంటి వ్యవస్థ వలన చదువుకున్న యువకులు రాజకీయలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రధాన ప్రాత పోషించటంతో.. చదువుకున్న యువకులు రాజకీయంలో ముందుకు రాలేకపోతున్నారని మేథావులు అంటున్నారు.. ఇకనైన రాష్ట్ర ప్రజలు ఆలోచించి .. ఓటు హక్కు వినియోగించుకొని , మంచి రాజకీయ నాయకులను ఎన్నుకొంటే దేశా రాజకీయ వ్యవస్థ బాగుపడుతుందని సీనియర్ విశ్లేషకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more