A low cost toilet is bill gates ultimate dream

A low-cost toilet is Bill Gates' ultimate dream,Microsoft,Melinda Gates,Bill Gates,Bill Gates, Low-cost toilet, Bill and Melinda Gates Foundation

A low-cost toilet is Bill Gates' ultimate dream

toilet.gif

Posted: 06/01/2012 06:38 PM IST
A low cost toilet is bill gates ultimate dream

A low-cost toilet is Bill Gates' ultimate dream

కలలు కనండి.. కానీ వాటిని నిజం చేసుకోవటానికి కష్టపడండి? అని అబ్ధుల్ కలాం చెప్పటం జరిగింది. ఇప్పుడు తన కల నిజం చేయాలని ఒక అధినేత తపించిపోతున్నాడు. ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ నిపుణుడు.. మైక్రోసాఫ్ట్ అధినేత.. బిల్‌గేట్స్ కల ఏమై ఉంటుందంటారు? ఎవరూ ఊహించలేనంత గొప్ప సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం అనుకుంటే పొరబడినట్టే! ఆయన కల... అత్యంత చౌకైన, అసలు నీటి అవసరమే లేని మరుగుదొడ్లని నిర్మించడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ తరహా మరుగుదొడ్లు వరమని ఆయన అభిప్రాయం. అందుకే ఈ విషయాన్ని అల్లాటప్పాగా తీసుకోవట్లేదాయన.

ఇందుకోసం వచ్చే ఆగస్టులో సియాటిల్(అమెరికా)లో ప్రపంచప్రసిద్ధి గాంచిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో ఒక భేటీని కూడా నిర్వహించనున్నారు.ఆ సమావేశం ఏకైక ఎజెండా.. చౌకయిన, నీరు అవసరం లేని మరుగుదొడ్ల రూపకల్పన. ప్రజారోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఈ ఆవిష్కరణ తన కల అని ఆయన తెలిపారు.అయితే ఇదొక్కటే అంతిమ కల కాదని.. పోలియో, హెచ్ఐవీ, మలేరియా లాంటి వ్యాధులు లేని ప్రపంచాన్ని చూడాలనేవి తన కలలని వివరించారు. "అంతర్జాతీయంగా ఈ అంశంపై అధ్యయనం చేసిన పలువురు నిపుణులు ఉన్నారు. మేం ఖర్చుకు సిద్ధంగా ఉన్నాం.

చౌక మరుగుదొడ్ల నమూనాలు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతున్నాం. ఈ ఆగస్టులో దీనిపై సైంటిస్టులు, ఇంజనీర్లతో సమావేశాన్ని నిర్వహించనున్నాం'' అని తెలిపారు.ఒకవేళ ఆ బృందందాన్ని సాధించలేకపోతే కొత్తగా మరో బృందాన్ని ఆహ్వానిస్తామన్నారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున భారతదేశంలో చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు బిల్‌గేట్స్ భారతదేశానికి వచ్చారు. మన భారతదేశం విషయానికొస్తే.. ఇక్కడి 24.66 కోట్ల కుటుంబాల్లో కనీసం సగానికి కూడా మరుగుదొడ్లు లేవు! దేశంలో 46.9 శాతం కుటుంబాలకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది.

మిగతా కుటుంబాల్లో 3.2 శాతం ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను వినియోగించుకుంటున్నాయి.మిగతా 49.8 శాతం కుటుంబాలకూ బహిరంగ మల, మూత్ర విసర్జనే గతి దీనిపై కేంద్ర గ్రామీణాభిృద్ధి శాఖ మంత్రి జైరామ్ రమేశ్ ఇప్పటికే పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు కూడా. పరిశుభ్ర భారతం కోసం భారీ ఎత్తున ప్రచారోద్యమానికి రూపకల్పన చేసి, దానికి విద్యాబాలన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.బహిరంగ మల, మూత్ర విసర్జన వల్ల పరిశుభ్రత లోపించి ఏటా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులు డయేరియా వంటి వ్యాధుల బారిన పడి మరణిస్తున్నారు. సరైన మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారం. అందులోనూ.. నీటి సౌకర్యం అవసరంలేని, చౌక మరుగుదొడ్లు మరింత ఉపయోగకరమని గేట్స్ ఉద్దేశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jaganmohan reddy
Dhammu actress karthika  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more