గబ్బర్ సింగ్ కలెక్షన్స్ సునామీలా కురుస్తూ రికార్డుల క్రియేట్ చేస్తూంటే పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. ఆయన తన నిర్మాత బండ్ల గణేష్ పిలిచి ..కలెక్షన్స్ గురించి ప్రెస్ స్టేట్ మెంట్స్ ఇవ్వద్దని స్ట్రిక్ట్ గా చెప్పారని సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రతీ విషయంలో ఆచి తూచి అడుగువేస్తూంటారు. గబ్బర్ సింగ్ విషయంలో అదే జరుగుతోంది. హీరోల ఫ్యాన్స్ మధ్యన చిచ్చు రగిల్చే విధంగా కలెక్షన్స్,రికార్డుల గురించి అఫీషియల్ గా స్టేట్ మెంట్ ఇవ్వద్దని ఆదేశించారని,అందుకే గణేష్ ఈ విషయమై మాట్లాడటం లేదని తెలుస్తోంది. ఇక పవన్ మాత్రం నా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు..అది చాలు అని చెప్పినట్లు తెలుస్తోంది.
అందుకే పవన్ ఆర్డర్ మేరకు గణేష్ ఈ చిత్రం కలెక్షన్స్ పిగర్స్ ని బయిట పెట్టడం లేదు. మరో ప్రక్క బయిట మాత్రం ఈ చిత్రం మిగతా హీరోల చిత్రాల కలెక్షన్స్ ని క్రాస్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పంజా సమయంలో నిర్మాతలు చిత్రం కలెక్షన్స్ మొదటి రోజే ప్రకటించారు. అలాగే పులి సమయంలోనూ కలెక్షన్స్ ప్రస్తావన వచ్చింది. అయిత ఇంత పెద్ద హిట్టన గబ్బర్ సింగ్ కలెక్షన్స్ రికర్డుల గురించి మాట్లాడుకోవటానికి లేకపోటం అభిమానులను మాత్రం కాస్త నిరాశపరుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం విజయం గురించి చెప్తూ...మన తెలుగు ఆడియన్స్ చాలా ఎంటర్టన్మెంట్ కోరుకుంటారు..అలాగే ఫార్మెట్ ఒకటే ఉంటుంది.
అలాంటప్పుడు దాన్ని కొత్తగా చెప్పటం చాలా కష్టం. హరీష్ ..కథని ఎలా ఎడాప్ట్ చేసుకుంటే బావుంటుందో..ఎలా కన్వే చేస్తే బావుంటుందో తెలుసు. అంతకు ముందు కూడా నేను మిరపకాయ చేయాల్సింది కానీ..వేరే కారణాల వల్ల నేను చెయ్యలేకపోయాను..అప్పటి నుంచీ నాకు తెలుసు..అతను ప్రతీ హీరోకి ఎడాప్ట్ అవ్వగలడు అన్నారు. అందరితో నడుచుకునే విధానం చాలా బాగుంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more