కొత్త విద్యుత్‌ప్లాంట్లు కట్టడంలో జెన్‌కోకు విశేష అనుభవం, సామర్ధ్యం ఉన్నాయి. కానీ వైఎస్ వీటీపీఎస్ ఏడో దశ, భూపాలపల్లి ఐదో దశను బీజీఆర్ అనే కంపెనీకి ఇచ్చారు. ఇందులో కేవీపీ కొడుకు బినామీ. అతడికి ఇంత పెద్ద విద్యుత్ ప్రాజెక్టులు కట్టే అనుభవం లేక వాటిని నాశనం చేసి వదిలిపెట్టాడు. దీంతో అవి మాటిమాటికీ ట్రిప్పయి విద్యుత్తు కోతలతో ప్రజలు యాతనలు పడుతున్నారు' అన్నారు. కేవీపీ ఒక కేటుగాడని, ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతోందని దాక్కొని దాక్కొని తిరుగుతున్నారని ముద్దు ఆరోపించారు. జగన్‌ను అరెస్టుచేసే సమయంలో కేవీపీని కూడా కలిపి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక వెలుగు వెలిగిన ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు తనయుడు కూడా జగన్ అంత ఘటికుడేనని టీడీపీ వ్యాఖ్యానించింది. ముడుపుల్లో ముప్పాతిక వంతు జగన్‌కు వెళ్తే పావలా వాటా కేవీపీ ఇంటికి వెళ్లాయని, జగన్ లక్ష కోట్లు సంపాదిస్తే కేవీపీ కొడుకు పాతిక వేల కోట్లు సంపాదించారని ఆ పార్టీ నేతలు ముద్దు కృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోపించారు.
'రాజశేఖరరెడ్డి సీఎం కాక ముందు కేవీపీ తన పిల్లల చదువులకు ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నారు. ఆయన కుమారులకు నేను సీట్లు ఇప్పించాను. ఇప్పుడు కేవీపీ కుటుంబానికి దుబాయిలో వాణిజ్య భవనాలు, మనదేశంలో ఐదువేల మెగావాట్ల పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఐదేళ్లలో ఇంత సంపద ఎక్కడిది? వైఎస్ హయాంలో ప్రతి వ్యవహారం కేవీపీకి తెలిసే జరిగింది. అయినా ఆయనను సీబీఐ ఎందుకు విచారించట్లేదు?' అని ముద్దు ప్రశ్నించారు. వైఎస్, కేవీపీల అత్యాశ వల్లే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు దుర్భరమైన కరెంటు కోతను అనుభవిస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర మంత్రులు క్యూ కట్టి సీబీఐ ముందు విచారణకు హాజరు కావడం ప్రొటోకాల్‌కే అవమానంగా మారిందని, ముందు వారు తమ పదవులను వదిలిపెట్టి తర్వాత విచారణకు హాజరు కావాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ ఆదేశాలపై సంతకాలు చేస్తున్న హోంమంత్రి మరోపక్క తాను సీబీఐ విచారణకు హాజరు అవుతున్నారని, ఒకవేళ హోం మంత్రిని అరెస్టు చేస్తే రాష్ట్రం పరువు పోతుందని.. ముందే ఆమెతో రాజీనామా చేయిస్తే మంచిదని ముద్దు సూచించారు. కేవీపీ, సూరీడు, సరసాదేవి వంటివారు అప్రూవర్లుగా మారి గతంలో జరిగిన వ్యవహారాలను బయటపెట్టాలని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more