సామ్యవాద సిద్ధంతాలకు, పెట్టుబడిదారీ వ్యవస్థకు మధ్య పోరాటం ఈనాటిది కాదు. రక్తాన్ని చెమటలా మార్చి పెట్టుబడిదారులకు లాభాలు పండించే కార్మికుల జీవితాలు మాత్రం దుర్బరంగా ఉంటున్నాయి. తమ న్యాయబద్ధమైన కోరికల కోసం వారు ప్రపంచంలో ప్రతిచోటా ఐక్యపోరాటాలు సాగిస్తూనే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు తమ పోరాటాలకు సంఘీభావం ప్రకటించుకునే సందర్భం...మేడే.
నిజానికి మేడే ఓ సాంస్కృతిక దినోత్సవంగా యూరప్ లో మొదలైంది. కొత్త సీజన్ ప్రారంభానికి చిహ్నంగా ఈ రోజును జరుపుకునే వారు. అయతే 1644లో బ్రిటన్ పార్లమెంట్ ఈ వేడుకను నిషేధించింది. అప్పట్లో ప్రభావవంతమైన చర్చి, మేడే రోజున సన్యాసుల పేరిట వేడుకలు ప్రారంభించింది. ఇలా కొనసాగిన మేడే, పెట్టుబడి దారీ విప్లవం తర్వాత కొత్తరూపును సంతరించుకుంది. సామ్యవాద భావజాలంతో మతపరమైన విశ్వాసాలు కనుమరుగై కొత్తరూపును సంతరించుకుంది. ముఖ్యంగా దిగువస్థాయి వర్గాలు, కార్మికులు జరుపుకునే ఈ పండుగ... కార్మికవర్గ సంఘీభావానికి ప్రతీకగా నిలిచింది.
1884, మే 1న కార్మికులకు రోజుకు ఎనిమిది గంటల పని సరిపోతుందని చట్టం చేశారు. ఇది కార్యరూపం దాల్చడానికి చాలాకాలమే పట్టింది. అయితే సంస్థల నిర్వాహకులకు ఇది నచ్చలేదు. దీంతో మే 1, 1886న కార్మికులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. మూడున్నర లక్షలకు పైగా కార్మికులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వీరికి తోడుగా వందలాది మంది మార్చ్ లు, ప్రదర్శనలు నిర్వహించారు. వీరి పోరాటాన్ని అణిచివేసేందుకు పాలకులు రకరకాల విధానాలు అనుసరించారు. ఈ సందర్బంగా జరిగిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు మృతిచెందగా, లెక్కనేనంతమంది క్షతగాత్రులయ్యారు.
దీనికి తోడుగా మే 4న అంతర్జాతీయ ప్రజా సంఘం ఆధ్వర్యంలో హేమార్కెట్ స్క్వేర్ దగ్గర ఓ ప్రదర్శన జరిగింది. ఆఖరి వక్త ప్రసంగం ముగించగానే బాంబు పేలి కొందరు పోలీసులు మరణించారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు నిరాయుధులైన ప్రదర్శనకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇందులో మృతిచెందిన, గాయపడిన వారి వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. ఈ సంఘటనకు బాధ్యులుగా అరెస్టయినవారికి సరైన సాక్ష్యాధారలు లేకుండానే శిక్షవిధించారు. ఎనిమిది మందిలో నలుగుర్ని ఉరి తీశారు. మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. 1893లో కార్మికవర్గాల నుంచి వచ్చిన ఒత్తిడితో మిగతా ముగ్గుర్నీ విడిచిపెట్టారు.
1890, మే 1న, హేమార్కెట్ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. వీరికి మద్ధతుగా యూరప్, అమెరికా అంతటా ప్రదర్శనలు జరిగాయి. రోజుకు ఎనిమిది గంటల పని నిబంధన అమలు చేయాలని కార్మికులు పట్టుబట్టారు. తాము చిందించిన, భవిష్యత్ లో చిందించబోయే రక్తాన్ని గుర్తుచేస్తూ ఎరుపు రంగులో జండాని రూపొందించారు. అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ప్రభావంతో 1891 నుంచి రష్యాలో, 1920 నుంచి చైనాలో, 1927 నుంచి భారత్ లో మేడే వేడుకలు జరగుతున్నాయి. మేడే సందర్భంగా కార్మిక లోకానికి ఆంధ్రావిశేష్.కాం శుభాకాంక్షలు
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more