Palvai advises congress to apologise for ysr misdeeds

rajya sabha mp, palvai govardhan reddy, chief minister, ys rajasekhara reddy, corruption Hyderabad News, Newspaper, breaking news

Rajya Sabha MP of Congress Palvai Govardhan Reddy on Saturday advised the Congress party to apologise to the public on the mistakes done by former Chief Minister

Palvai advises Congress to apologise for YSR misdeeds.gif

Posted: 04/23/2012 05:23 PM IST
Palvai advises congress to apologise for ysr misdeeds

Marri-Shashidhar-Reddy_Palv

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ని కాంగ్రెస్ లో కొందరు వెనకేసుకొస్తుంటే.. మరికొందరు అతని మాటల యుద్దానికి దిగారు. కాంగ్రెస్ కి చెందిన సీనియర్ నాయకులైనా పాల్వాయి గోవర్థన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డిలు వైయస్ బహిరంగానే మాటల దాడికి దిగారు. మొన్నటికి మొన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించవద్దని చెప్పిన తరువాత వాత కూడా వీరు వ్యాఖ్యలు చేయడంతో వైయస్ పై దాడి మొదలైందని అనుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ..అవినీతితో లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, పీసీసీ చీఫ్ మీద దుమ్మెత్తి పోస్తున్నాడని, తానొస్తే రెండేళ్లలో పోలవరం కట్టేస్తా అంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1800 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చినా, దురదృష్టవశాత్తు ఆ విషయం ప్రజలకు తెలియకపోబట్ట్టే, జగన్ తప్పు చేసి కూడా తాను నీతిపరుడన్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడని చెప్పారు.

జగన్ ఎవరి సహకారంతో డబ్బు సంపాదించాడో చెప్పకపోతే అది కాంగ్రెస్‌పార్టీకి హానే చేస్తుందని, అందుకే గతంలో చేసిన తప్పును గుర్తించి, దాన్ని ఒప్పుకోవడం మంచిదేనని పాల్వాయి అన్నారు. "తన వెంట ఉన్నవాళ్లు, జగన్ కలిసి పెద్ద ఎత్తున అక్రమాలు చేసి లక్షలు సంపాదిస్తే.. రాజశేఖరరెడ్డిది తప్పు లేదనడం ఎందుకు? జగన్‌ను ప్రజల నుంచి దూరం చేయాలంటే వైఎస్ కాలంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలి. వైఎస్ కేబినెట్‌లో రెండు రకాల వాళ్లు ఉన్నారు. కొంతమంది వైఎస్ కోసం.. మరికొందరు వైఎస్‌కు ఎదురు చెప్పలేక మౌనంగా కూర్చున్నారు. తప్పులు చేయడం మంచిది కాదని చెప్పినవాళ్లలో బొత్స ఒకరు. పార్టీ అధ్యక్షుడు కాబట్టి బొత్స కొంత సమన్వయం పాటించాలి. కానీ.. తప్పు చేసినప్పుడు ప్రజలను క్షమాపణ కోరటంలో తప్పు లేదు'' అన్నారు.  తాను అధికారంలోకివస్తే రాయి, రప్ప అన్నీ అమ్మేసుకుంటాడని, అలాంటివాడు సీఎం అయితే రాష్ట్రం మొత్తం దివాలా తీస్తుందని ఎద్దేవా చేశారు.

మరో వైపు జాతీయ విపత్తు నిర్వహణ వైస్ చైర్మన్ మర్రి శశిధర రెడ్డి కూడా విమర్శలు చేశారు. నగరం పరిధిలో స్థలం ఉందో లేదో చూసుకోకుండానే వైయస్ గృహ నిర్మాణ పథకాలను ప్రారంభించారని ఆయన ఆరోపించారు. ఆయన కారణంగా ఇప్పుడు ప్రజలు, అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వైయస్ వందల ఎకరాల విలువైన భూములను సెజ్‌లకు కట్టబెట్టి నగరంలోని పేదలకు ఇళ్లు లేకుండా చేశారని మండిపడ్డారు. స్థలం లేకుండానే రాజీవ్ గృహకల్ప, స్వగృహ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రవేశ పెట్టడంతో ఇబ్బందులు వచ్చాయని వివరణ ఇచ్చారు.గతంలో సికిందరాబాద్‌లో ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీతో రాజీవ్ గృహకల్ప పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారన్నారు. ప్రస్తుతం మాత్రం ఇళ్లు నిర్మించేందుకు స్థలం లేక ఇక్కట్లు ఎదురవుతున్నాయన్నారు. వైయస్‌కు ముందు చూపులేకుండా పథకాలు ప్రారంభించారనడానికి ఇదే నిదర్శనమని ఆయన చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఇక పై కాంగ్రెస్ వాళ్ళు వైయస్ పై మాటల దాడికి దిగొచ్చని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalyan becomes highest paid actor
Trs mla harish rao counters trs chiefs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more