Trs mla harish rao counters trs chiefs

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

TRS MLA Harish Rao counters TRS chiefs declaration over merger of TRS in congress. Differences between Left parties widen in AP with CPI and CPM parting ways. ... Rift in TRS leadership - KCR and Harish Rao over T agitation.`

TRS MLA Harish Rao counters TRS chiefs.gif

Posted: 04/23/2012 03:40 PM IST
Trs mla harish rao counters trs chiefs

Harish-rao_kcr

తెలంగాణ ఉద్యమాన్ని గత పదేళ్ళుగా ఒంటిచేత నడిపిస్తూ ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఇక పై ఆ పార్టీని నడింపించేంత శక్తి లేదా ? లేక తెలంగాణ అంశాన్నే ఎంజెండాగా పెట్టుకొని పోరాడుతున్న కేసీఆర్ ఒక వేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తనకు టీఆర్ఎస్ పార్టీనే అవసరం లేదని భావిస్తున్నాడా ? అందుకే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పార్టీని అందులో వినీనం చేస్తాననే సంకేతాలు పంపుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

మరి తన పార్టీలో ఆయన తరువాత కీలక పాత్ర పోషిస్తున్న హరీష్ రావు విలీనానికి వ్యతిరేకంగా ఉండటంతో వీరిద్దరి మధ్య ఈ అంశంలో చిచ్చు పుట్టేటట్లు కనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే ఆ పార్టీలో విలీనం అ యేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మానసికంగా సిద్ధమవుతున్నారు. అయి తే, ప్రత్యేక రాష్ట్రం వచ్చినా టీఆర్‌ఎస్‌ ఎందులోనూ విలీనం కాదని ఆయన అల్లు డు, పార్టీలో సీనియర్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్‌ అనేకసార్లు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒక సమయంలో అయితే ఆయన దీనిపై మేధావులు, జాక్‌ సంస్థల ప్రతినిధులు, విద్యార్ధి సంఘాలు, తనను కలిసేందుకు వచ్చిన తెలంగా ణ లెక్చరర్ల సంఘం ప్రతినిధులతో కూడా అభిప్రాయ సేకరణ చేశారు. తెలంగా ణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక పార్టీ అవసరం లేదని, తనకు తెలంగాణ సాధనే తప్ప పార్టీ ముఖ్యం కాదని కేసీఆర్‌ వారి వద్ద స్పష్టం చేశారు. 

ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ కి వైద్యం చేయడానికి వచ్చిన వాయలార్ రవితో సైతం కాంగ్రెస్ ఈ విషయం చెప్పినట్లు సమాచారం. గతంలో సర్వే సత్యనారాయణ పాల్గొన్న ఓ సభలో కూడా కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తుందని, అప్పుడు కేసీఆర్‌ తన పార్టీని విలీనం చేస్తారని కేసీఆర్‌ సమక్షంలోనే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి మానసికంగా సిద్ధంగానే ఉన్నారని చెబుతున్నారు. అయితే.. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ తర్వాత కేసీఆర్ లాంటి వాడు, సీనియర్‌ ఎ మ్మెల్యే హరీష్‌రావు మాత్రం, విలీనానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు ఆయన మా టల ధోరణి స్పష్టం చేస్తోంది. తెలంగాణ వచ్చినా టీఆర్‌ఎస్‌ ఏ పార్టీలోనూ విలీ నం కాదని, టీఆర్‌ఎస్‌గానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీన్ని బట్టి విలీనం పై హరీష్‌రావు వ్యతిరేకంగా ఉన్నారని, ఒకవేళ కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం చేస్తే హరీష్‌రావు సొంత దారి చూసుకుంటారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

వైఎస్‌ లేని రాష్ట్ర రాజకీయాలు అనిశ్చితంగా తయారయినందున, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ కొనసాగడమే మంచిదన్న ఆలోచనతో ఉన్నారంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌ తెలంగాణ ప్రకటించినప్పటికీ, తెలంగాణ కోసం మొదటి నుంచీ పోరాడుతున్నందున ఆ క్రెడిట్‌ తమకే దక్కుతుందని, అప్పుడు తెలం గాణలో పెద్ద పార్టీ టీఆర్‌ఎస్‌ అవుతుందని, కాంగ్రెస్‌లో చేరితే స్వేచ్ఛ ఉండదన్న అంచనాతో ఉన్నందుకే హరీష్‌రావు భిన్నంగా ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ కి చంద్రబాబు లాగ హరీష్ రావు తయారయ్యాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Palvai advises congress to apologise for ysr misdeeds
Kajal agarwal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more