ఇకపై అపార్ట్ మెంట్స్ వంటి భారీ నిర్మాణాలకు ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే. రాష్ట్రంలోని మహానగర పాలక సంస్థలు, నగరాభివద్ధి సంస్థలు, మునిసి పాలిటీలు, నగర పంచాయతీలలో నిర్మాణాలకు ని‘బంధనాలు’ రూపొందిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడ, హైదరాబాద్, హెచ్‌ఎండిఏ, వుడా, విజిటిఎం తదితర నగరాభివద్ధి సంస్థల పరిధిలో నిర్మించే అపార్ట్‌మెంట్లలో ఇకపై వీకర్‌సెక్షన్స్‌ను 20శాతం ఎల్‌ఐజి ప్లాట్లు, భవనాలు నిర్మించాలి. అన్ని రకాల భవన నిర్మాణాల అనుమతులను కఠినతరం చేసింది. నిబంధనలు ఉల్లం ఘించి నిర్మించేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. మునిసిపాలిటీలలో అక్రమ నిర్మాణాలు వెలిస్తే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సిందే.
గతంలో అనుమతులు ఉల్లం ఘించి నిర్మాణాలపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇకపై భవన నిర్మాణాలకు అనుమతులు, నిబం ధనలపై సమగ్ర భవన నిర్మాణ నిబంధనలు- 2012’’ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు వివిద కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరాభివద్ధి సంస్థల పరిదిలో ఒకే విదానమైన నిబందనలు లేకపోవడంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్న దష్ట్యా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, మహానగర పాలక సంస్థలు, నగర పంచాయతీలలో అన్ని రకాల భవన నిర్మాణాలపై సమగ్ర విదానాన్ని రూపొందించింది. గ్రుహనిర్మాణం, గ్రూప్ హౌజింగ్, వ్యక్తిగత, కమర్షియల్ కాంప్లెక్స్‌లు 10మీటర్ల ఎత్తు వరకు నిర్మాణ భవనాలకు, ఆకాశహర్మ్యాలు, సెల్లార్లు సుమారు 9మీటర్ల రోడ్డు తప్పకుండా ఉండాలి.
బి-2 కేటగిరిలో 24మీటర్లు (ఆరు అంతస్థులు) విద్యాసంస్థలు, గోదాములు, వ్యాపార సముదాయాలు, నర్సింగ్ హోమ్స్ (20‘ెడ్స్‌కు మించని ఆసుపత్రులు), బి-3కేటగిరిల కింద కాలేజీలు, బహుళ ప్రయోజనాల భవనాలు, షాపింగ్‌మాల్స్ (4వేల చదరపు మీటర్లపైన)భవన నిర్మాణాలకు 18మీటర్ల రహదారి ఉండాలి. ఇందులో ముఖ్యంగా భవన నిర్మాణ నమోనాలు రూపొందించే ముందు స్థాభూ సారవంతాన్ని పరిశీలించి నిర్మాణాలు చేపట్టాలి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్‌గా పేర్కొన్నారు. ఇందుకుగాను 373పేజీల సమగ్ర భవన నిర్మాణ రూల్స్ ను పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి బి.శ్యామ్‌రావ్ విడుదల చేశారు.
ఆకాశ హార్మ్యాలకు సుమారు 2000 చ.మీటర్ల స్థలం ఉండాలి. (నాలుగువైపుల నిబందనలమేరకు సెట్‌యక్(ఖాళీస్థలం ఉండాలి). ఆసుపత్రి భవనాలు (30మీ ఎత్తు ఉంటే) ఆగ్నిమాపక నిబం‘దనలు-2011 జీవో నెంబర్ 2 తప్పని సరిగా పాటించాలి. గ్రూపు హౌజింగ్‌లో 20శాతం స్థలం గ్రీనరీకి కేటాయించాలి. జిహెచ్‌ఎంసీ, విశాఖ, విజయవాడ, హెచ్‌ఎండీఏ, విజిటిఎం తదితర పట్టణాల్లో నిర్మించే అపార్ట్‌మెంట్లలో నిరుపేదలకు అనుకూలంగా 20శాతం తప్పకుండా (ఎల్‌ఐజి) నిర్మాణాలు చేపట్టాలి. బిల్డింగ్ కమిటీల నిర్మాణం జిహెచ్‌ఎంసీ పరిదిలో సీసీపీ, టౌన్‌ప్లాన్ సెన్ హెడ్ కన్వీనర్‌గా, డిటిసిపి తరపున మెంబర్‌గా ఉంటారు. ఇదే తరహాలో అన్ని అభివద్ధి సంస్థలలో కమిటీలు ఉంటాయి. భవన నిర్మాణాలపై వచ్చే ఫిర్యాదులు తదితర వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయం.
...avnk
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more