కర్ణాటక రాజకీయాంలో కొరకరాని కొయ్యగా మారిన యడ్యూరప్ప విషయంలో బీజేపీ అధిష్ఠానం మెత్తబడిందా..? ఆయనను మళ్ళీ సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని నిర్ణయించిందా..? దీనికి ఔననే సమాధానాలే వస్తున్నాయి. ఈ మేరకు అధిష్ఠానం పెద్దల నుంచి యడ్యూరప్పకు సానుకూల సంకేతాలు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే.. యడ్యూరప్ప యత్నాలకు పోటీగా.. ప్రస్తుత సీఎం సదానందగౌడ కూడా తన బలం చూపించడానికి సిద్ధమైపోయారు.
20 మంది ఎమ్మెల్యేలతో క్యాంప్ ఏర్పాటు చేశారు. దానికి తోడు సీఎం సదానంద కులానికి చెందిన వక్కలిగ సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. ఒకవేళ ఆయనను గద్దె దించితే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించాయి. మరోవైపు చాలా మంది ఎమ్మెల్యేలు ఏ వర్గంలోనూ చేరక తటస్థంగా ఉన్నారు. ఇలా కన్నడ నాట బీజేపీ మూడు గ్రూపులుగా చీలిపోయింది. ఈ గందరగోళం మధ్య బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
స్పష్టమైన హామీ లభించేంత వరకు రిసార్టు బాటను వీడేది లేదని యడ్యూరప్ప మొండికేస్తున్నారు. రెండు రోజులుగా ఆయన వర్గానికి చెందిన 70 మంది ఎమ్మెల్యేలు నగర శివారులోని గోల్డెన్ ఫామ్ రిసార్టులో తిష్ఠ వేశారు. వారితో.. యడ్యూరప్ప మంతనాలు జరుపుతూనే ఉన్నారు. చర్చలకు రమ్మంటూ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఆహ్వానించినా.. ఫోన్‌లో మాట్లాడేందుకు సీఎం సదానంద గౌడ యత్నించినా.. యడ్యూరప్ప స్పందించలేదు. తక్షణమే శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తదుపరి నేతను ఎమ్మెల్యేలే ఎన్నుకుంటారని అప్ప శిబిరంలోని మంత్రులు అంటున్నారు. నాటకీయంగా గాలి సోదరుడు కరుణాకరరెడ్డి యడ్డి శిబిరంలో ప్రత్యక్షమయ్యారు.
అయితే.. తన వర్గానికి చెందిన పుట్టస్వామిని రాజ్యసభ బరిలోకి దించి యడ్డి అధిష్ఠానానికి మరో సవాల్ విసిరారు. కానీ, పార్టీ అనుమతి లేకుండా ఈ నామినేషన్ దాఖలు చేసినందుకు.. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేఎస్ ఈశ్వరప్ప పుట్టస్వామిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే.. సస్పెన్షన్ సమాచారం తనకు ఇంకా అందలేదని, అయినా.. నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడమేమిటని పుట్టస్వామి పేర్కొన్నారు. మరోవైపు... యడ్డికి సీఎం పదవి ఇవ్వాలంటూ.. 10 మంది లోక్‌సభ సభ్యులు, ముగ్గురు రాజ్యసభ సభ్యుల సంతకాలతో కూడిన ఒక వినతి పత్రాలను ఢిల్లీలో సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీలకు అందించారు. యడ్డి తనయుడి ఆధ్వర్యంలో పలువురు ఎంపీలు భేటీ అయ్యారు.
సదానందను గద్దె దించితే రాజీనామా చేస్తామని మంత్రి బాలచంద్ర నాయకత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు హెచ్చరించారు. సదానందతో భేటీ కావాలని నిర్ణయించారు. మరోవైపు సదానందగౌడకు వక్కలిగ కుల సంఘాలు మద్దతు పలికాయి. ఆయనను గద్దె దించితే.. రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరించాయి. ఆ కులానికి చెందిన స్వామిజీలు కూడా గౌడకు మద్దతు ప్రకటించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more