గతంలో ఆంద్రవిశేష్ చెప్పిందే. ఈరోజ అది నిజమైంది. చిరు కు అధిష్టానం రాజ్య సభ పదవి ఇవ్వటంతో ముఖ్యమంత్రికి ఇష్టంలేదని ముందు చెప్పింది ఆంద్రవిశేష్. సీఎం దీనిపై అధిష్టానంతో కలిసి ..చిరు రాజ్య సభ సీటు ఇవ్వకండి అని ఒక కారణం చూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కారణమే.. సీఎం కొత్త తలనొప్పిగా మారింది. చిరు రాజ్య సభకు వెళుతున్న సందర్భంగా .. తిరుపతి ఎమ్మెల్యే పదవి ఖాళీ అవుతుంది. కాబట్టి తిరుపతిలో .. బై ఎలక్షన్ జరుపుతారు . అప్పుడు తప్పనిసరిగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే గెలుపించుకోవటవలో .. ముఖ్యమంత్రి పాత్ర చాలా ఉంది. చిరు కూడా తన కుటుంబం నుండి తిరుపతికి ఎవరు పోటీలో దిగారు అని బహిరంగంగా ప్రకటన చేయటనంతో.. ముఖ్యమంత్రి షాక్ తిన్నట్లైంది. సీఎం చెప్పిన కారణానికి అధిష్టోనం నో బోర్టు పెట్టింది. ఆ సమస్య నుండి బయట పడటానికి .. సీఎం కొత్త ఫ్లాన్ కూడా వేశాడట. అదే చిరు రాజ్యసభకు వెళితే.. ఆయన కుటుంబం నుండి ఎవరినైన తిరుపతిలో ఎమ్మెల్మే పదవి బరిలో దించుతామని సీఎం చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు సీఎం ఆ ఆశ కూడా లేకుండా చేశాడు చిరంజీవి. ఇప్పుడు సీఎం పరిస్థితి ముందు గొయ్యి.. వెనక నూయ్యి అనే విధంగా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుంది కాంగ్రెస్‌లో పరిస్థితి. రాజ్యసభకు అవకాశం పొంది చిరంజీవి ఎంచక్కా పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ, చిరంజీవి రాజీనామా అనంతరం ఖాళీ కాబోతున్న తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి ప్రతిష్ఠాత్మకంగా మారనుంది. తన సొంత జిల్లాలో జరగబోయే ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను గెలుపు బాటలో నడిపించలేకపోతే అది అంతిమంగా కిరణ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తుందన్న అభిప్రాయం కాంగ్రెస్‌లో వినిపిస్తోంది.
తిరుపతి నుంచి పోటీ చేసేందుకు మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ ఉత్సాహం చూపుతున్నారు. పారిశ్రామికవేత్తగా తాను చేసిన సేవలే.. తన గెలుపునకు ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నారు. కాగా, ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో తొలి నుంచి కూడా కాపు, రెడ్డి సామాజిక వర్గాల వారి ఆధిపత్యమే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన జయదేవ్ పోటీ చేసి.. గెలవగలరా? అని కొందరు నేతలు అంటున్నారు. అయితే, చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అరుణ కుమారి కుటుంబం నుంచి మరొకరికి అవకాశం దక్కుతుందా? అన్న సందేహాలను కూడా కొందరు లేవనెత్తుతున్నారు.
ఆమె మాత్రం తమ కుటుంబం నుంచి ఇద్దరు రాజకీయాల్లో ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే రమణ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. తిరుపతి సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ స్థానం నుంచి రాజీనామా చేయనున్న చిరంజీవి.. ఇక్కడి నుంచి తాను సూచించిన అభ్యర్థికే సీటు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరే ఆలోచనలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
అభ్యర్థి ఎవరైనా సరే.. తిరుపతి ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు భారం మాత్రం సీఎం కిరణ్‌పైనే పడుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి, మినీ సార్వత్రిక ఎన్నికలను తలపించే రెండో దశ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం కాబోతోంది. ఇప్పటి వరకూ 17 అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు లోక్‌సభ స్థానం ఖాళీగా ఉంది. అయితే.. తిరుపతి ఎమ్మెల్యే కె.చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం దక్కనున్న నేపథ్యంలో.. ఈ స్థానం కూడా ఖాళీ కానుండటంతో.. 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more