Mohanbabu as ravana in next film

Mohanbabu As Ravana In Next Film,"mohanbabu, ravana, k.raghavedra rao, dr.maohanbabu, ravanabrahma, mohanbabu new, latest news, movie updates, raghavendraao ravana,

Mohanbabu As Ravana In Next Film

Mohanbabu.gif

Posted: 03/19/2012 07:23 PM IST
Mohanbabu as ravana in next film

Mohanbabu As Ravana In Next Film

మాటల్ని తూటాల్లా పేల్చే నటుడు మోహన్‌బాబు. వెండితెరపై ఆయన పలికే సంభాషణలు... ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చాంతాడంత సంభాషణల్ని సైతం అలవోకగా, ప్రతిపదం అర్థమయ్యేలా పలుకుతూ పాత్రకు ప్రాణం పోస్తారు. ఆ లక్షణమే ఆయన్ని డైలాగ్‌కింగ్‌గా మార్చింది. ''పదాల్ని ఎక్కడ విరచాలో, ఎక్కడ ఒత్తి పలకాలో నటుడికి తెలియాలి. అప్పుడే ఆ సంభాషణ రక్తి కడుతుంద''ని చెబుతుంటారాయన.నటనలోనూ మోహన్‌బాబుది ప్రత్యేకశైలి. కథానాయకుడు, ప్రతినాయకుడు... పాత్ర ఏదైనా ఆయన ముద్ర ఉండాల్సిందే. 'స్వర్గం నరకం' నుంచి మొదలైన ఈ మాటకారి ప్రయాణం... దిగ్విజయంగా కొనసాగుతోంది. తనకు తగ్గ పాత్రలు వచ్చిన ప్రతిసారీ.. వాటిని భుజానికెత్తుకొన్నారు. తనవంతు బాధ్యతని నిర్వర్తించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ విజయవంతమైన చిత్రాల్ని అందించారు.

మోహన్‌బాబు మరోసారి కెమెరా ముందు బిజీ కాబోతున్నారు. 'రావణ' అనే పౌరాణిక చిత్రంలో నటించేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించే ఈ చిత్రం స్టోరీ డిస్కషన్స్ ఇప్పటికే ముగిశాయి. ఇందులో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేయబోతున్నారు. హాలీవుడ్‌కి చెందిన సాంకేతిక నిపుణులతో చర్చలు నడుస్తున్నాయి. అలాగే మోహన్‌బాబు స్వీయనిర్మాణంలో త్వరలో తెరకెక్కనున్న ఓ చిత్రంలోనూ ఆయనే నటిస్తారు. ఈ చిత్రం గురించి దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌ తరవాత సంభాషణలు ఆ స్థాయిలో పలికే నటుడు మోహన్‌బాబు. మా ఇద్దరి కలయికలో మంచి చిత్రాలొచ్చాయి. 'రావణ' కూడా అదే స్థాయిలో ఉంటుంది. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతామని అన్నారు. మైధలాజికల్ ధ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం

రాఘవేంద్రరావు,నాగార్జున కాంబినేషన్ లో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ విషయాన్ని మోహన్ బాబు స్వయంగా మీడియాకు తెలుపుతూ...రావణుడి ఔన్నత్యాన్ని చెప్పే సినిమా ఇది. ఇంతకుముందు ఎన్టీఆర్‌, ఎస్వీ రంగారావులాంటి మహా నటులు ఈ పాత్రలో కనిపించారు. వారి స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా నా శైలిలో రక్తి కట్టించేందుకు ప్రయత్నిస్తాను. భారత చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తారు. అధునాతన త్రీడీ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని అన్నారు. ఇక ఈ రోజు మోహన్ బాబు పుట్టిన రోజు...60 వ సంవత్సరంలో ప్రవేశిస్తున్నారు. ఎప్పటిలాగే తిరుపతిలోని తన శ్రీవిద్యానికేతన్‌ సంస్థల్లో విద్యార్థుల నడుమ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకొంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trisha have been put to rest
Suresh production sunil film launched  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more