షూటింగ్ లతో ఎప్పుడు బిజీగా ఉండే హీరోయిన్స్ కు .. ఒక్క రోజు విశ్రాంతి దొరికేతే చాలు వారికి పెద్ద పండగే. ఇప్పుడు ఇలాంటి పండగనే త్రిష చేసుకుంటుంది. ఒక్క రోజు ఏకంగా రెండు రోజులు విశ్రాంతి పండుగ చేసుకుంటుందని త్రిష కుటుంబ సభ్యులు అంటున్నారు.
త్రిషకి ఈ మధ్య అసలు ఆరోగ్యం బాగోలేదు. వైద్యులు ఓ వారం విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. దీంతో త్రిష ఇంట్లోనే గడుపుతోంది.
అయితే తాను హ్యాపీగానే ఉన్నానంటోంది త్రిష. ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... ''ఎంత పని ఒత్తిడిలో ఉన్నా... కుటుంబ సభ్యులతో గడపడం మరిచిపోను. కొన్నిసార్లు మాత్రం వీలుపడదు. అప్పుడు బాధేస్తుంటుంది. అనారోగ్యం పుణ్యమాని కుటుంబ సభ్యుల మధ్య ఇప్పుడు హాయిగా గడుపుతున్నా. పనిలో పనిగా నాకు ఇష్టమైన పెంపుడు కుక్కలతో కూడా ఆడుకుంటున్నా. అనారోగ్యం ఒక్కోసారి ఇలా మంచే చేస్తుంది అనిపిస్తోంది'' అని చెప్పుకొచ్చింది త్రిష. అలాగే
''జీవితంలో ఎన్ని సాధించినా, ఎంత సంపాదించినా... ప్రేమ, ఆప్యాయతలకు మాత్రం ఏదీ సాటి రాదు. కుటుంబ సభ్యులతో గడిపినప్పుడు కలిగే ఆనందం మరెక్కడా దొరకదు'' అంది. ఇక ప్రస్తుతం త్రిష..ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఆమె పక్కా మాస్ మసాలా పాత్రలో కనిపించనున్నట్లు చెప్తున్నారు. బాడీ గార్డ్ తర్వాత త్రిష తెలుగులో చేస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం విడదల అయ్యాక ఆమె మళ్లీ తెలుగులో బిజీ అవుతానని భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more