నందమూరి హీరో బాలకృష్ణతో తాను తొలిసారి నటిస్తున్నానని సికింద్రాబాద్ శాసనసభ్యురాలు, సహజ నటి జయసుధ అన్నారు. ఆమె అసెంబ్లీకి ఆలస్యంగా హాజరయ్యారు. లాబీల్లో నుంచి సభలోకి వెళ్లే సమయంలో అక్కడ ఉన్న విలేకరులతో సభ వాయిదా పడినట్లుందని ఆమె అన్నారు. దానికి విలేకరులు అవునని చెప్పారు. దానికి ఆమె నేను కేవలం అటెండెన్స్ కోసమే వస్తున్నట్లుగా ఉందని అన్నారు. ఆ తర్వాత ఆమె సభకు తప్పని సరిగా ప్రతిరోజు హాజరు కావాలా అని మళ్లీ విలేకరులను ప్రశ్నించారు. అందుకు వారు అదేం లేదని చెప్పారు.
ఈ సందర్భంగా ఆమె వారితో పిచ్చాపాటిగా మాట్లాడారు. మూడు రోజులుగా తాను సభకు రాలేదన్నారు. షూటింగ్ ఉంటే వెళ్లానని చెప్పారు. హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న అధినాయకుడు చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు. ఇందులో బాలకృష్ణ కొడుకు, తండ్రి, తాత పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. తండ్రి పాత్రకు భార్యగా చేస్తున్నానన్నారు. బాలయ్య సరసన తొలిసారిగా నటిస్తున్నానని, ఎలా ఉంటుందో చూడాలని అన్నారు.
జయసుధ అలా చెప్పటం వెనక పెద్ద రహస్యం ఉందని అంటున్నారు. హీరో బాలయ్య తో సినిమా చేస్తున్న తరుణంలో ..జయసుధ ఆలోచనలో కొత్త పుంతలు తొక్కుతుందని అంటున్నారు. బాలయ్య ద్వార.. తెలుగుదేశం పార్టీలో చేరాలనే కోరికను షూటింగ్ సమయంలో బాలయ్యతో చర్చించినట్లు తెలుస్తుంది. జయసుధ అడిగిదాని బాలయ్య మాట ఇచ్చినట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఎందుకైన మంచి ఒకసారి బావ తో మాట్లాడి చెబుతును అని బాలయ్య అన్నప్పుడు జయసుధ ..చాలా ఫీలైనట్లుగా బాలయ్య సన్నిహితులు చెబుతున్నారు. ఆ ఆనందంతోనే .. జయసుధ ప్రతి రోజు అసెంబ్లీ హాజరవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ విషయాన్ని బాలయ్య చంద్రబాబు వద్ద చర్చించగా.. ఆయన జయసుధ పై మంచి అభిప్రాయం లేదని కొన్ని ఉదహరణలు చెప్పినట్లు తెలుస్తుంది. అసలు జయసుధ మొదటి ప్రజరాజ్యం పార్టీ మహిళ అధ్యక్షురాలిగా చేరిన జయసుధ .. ఒక్క రోజు లోనే .. పార్టీ మార్చి కాంగ్రెస్ లో చేరింది. ఆమెది కమర్షియల్ మైండ్ , దివంగత నేత వైఎస్ ఉన్నంత కాలం .. జయసుధకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా తీరాయాని. ఆయన చనిపోయిన తరువత మరళ జయసుధకు కొత్త ఆర్థిక ఇబ్బందు తలెత్తటంతో.. ..కొత్తగా పార్టీ పెట్టిన .. వైఎస్ జగన్ పార్టీ చేరి .. తన అవసరాలను తీర్చుకున్నారని బాబు అన్నట్లు తెలిసింది. అంతేకాకుండా.. ఇప్పుడు జగన్ పై వస్తున్న అవినీతి కేసులు, సిబిఐ ఎంక్వైరీలతో భయపడిన జయసుధ .. మరళ కాంగ్రెస్ లో చేరాలని చూసింది.
కానీ కాంగ్రెస్ లో ఆమెకు ఆదరణ చాలా తక్కువుగా ఉందని తెలుసు. అందుకే రాబోయే ఎన్నికల నాటి ఉన్న పార్టీ వదిలి కొత్త పార్టీ వైపు అడుగులు వేయాలని చూస్తుందని టీడీపీ నాయకులు అంటున్నారు. అందువలన జయసుధను నమ్మటం చాలా కష్టమని కూడా తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు. మన పార్టీలో చేరిన అరగంటలోనే మరో పార్టీకి చేరదని గ్యారెంటీ లేదు. అందువలన ఆమెకు దూరంగా ఉండటమే మంచిదని బాలయ్య తెలుగుదేశం నేతలు హితబోధ చేశారని.. టీడీపీ భవనంలో నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more