వివాదాల రామ్ గోపాల్ వర్మ మరో సంచలనాత్మక ప్రకటన చేశాడు. ఏదైనా ఓపెన్ గా మాట్లాడి తన పాపులారిటీని పెంచుకోవడానికి చూసే వర్మ తాను కెరీర్ లో ఎలా ఎదిగానో చెప్పుకొచ్చాడు.
రామ్ గోపాల్ వర్మ సినీ దర్శకుడు కాకముందు హైదరాబాద్ లోని పంజాగుట్టలో సీడీల (క్యాసెట్ల) దుకాణం నడిపేవారు. అప్పట్లో వర్మ ఫైరసీ సీడీలు చేసి అమ్మి జైలుపాలు కూడా అయ్యాడు. ఇప్పుడు అదే విషయాన్ని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ దాకా అన్ని 'వుడ్‌ల' పెద్దలూ పైరసీతో నష్టపోతున్నాం మొర్రో అని నెత్తీనోరూ మొత్తుకుంటుంటే... వర్మ మాత్రం తన సానుభూతి పైరసీదారులకేనని ట్వీటారు. హైదరాబాద్‌లో వీడియో క్యాసెట్లు అద్దెకిచ్చే షాపు నడిపినప్పుడు తాను కూడా ఇలాగే పైరేటెడ్ క్యాసెట్లు తయారుచేసి, అద్దెకిచ్చి సొమ్ము చేసుకున్నానని, దానివల్లే తనకు ఆర్థిక స్థిరత్వం వచ్చిందన్నారు. ఆర్థికంగా ఆమేరకు వెసులుబాటు కలగడం వల్లే సంపాదన సంగతి పక్కనపెట్టి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించి పైకి రాగలిగానని తన ట్విట్టర్ ఖాతాలో వివరంగా రాశారు. తానూ ఒకప్పుడు 'పైరేట్' కాబట్టి తన సానుభూతి వారికి ఉంటుందన్నారు. ఇలాగే మ రో ఇంటర్వ్యూలో.. ట్విట్టర్‌తో ఎక్కువసేపు గడపడం అంత మంచిదికాదని సాక్షాత్తూ ఆ సైట్ సహవ్యవస్థాపకుడే హెచ్చరించారుకదా అని ప్రశ్నిస్తే.. ట్వీటింగ్ కూడా సృష్టికార్యం అంత మంచిదని సెలవిచ్చారు. సాధారణంగా జనం తమ ఆరోగ్యానికి ఏది మంచిది కాదో దాన్నే కోరుకుంటారని సూత్రీకరించారు.
అయితే దర్శకుడిగా నిలదొక్కుకున్న తరువాత వర్మ పైరసీ సీడీలు చేసే వారికి సపోర్ట్ గా మాట్లాడటం పై సినీ పరిశ్రమ గుర్రుగా ఉంది. మరి వర్మ కావాలని ఇలాంటివి చేస్తాడో, లేక నిజాల్ని దాచిపెట్టుకోలేక ఇలా అంటాడో ఆయనకే తెలియాలని సినీ జనాలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more