అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కొని తన పదవిని పోగొట్టుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన బెట్టును వీడి బీజేపీ అధిష్టానానికి సరెండర్ అయ్యాడు. నిన్న మొన్నటి వరకు అధిష్టానానికి డెడ్ లైన్ పెట్టిన యడ్డీ వెనక్కి తగ్గాడు. తన డెబ్బయ్యవ జన్మదినం సందర్భంగా బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే సమయంలో ఆరు నెలల తర్వాత తనను మళ్లీ ఆ పదవిలో నియమిస్తానని పార్టీ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని, ఒత్తిళ్లకు లొంగి తనను రాజీనామా చేయమంటున్నట్టు అధిష్టానం అప్పుడు చెప్పిందని తిరిగి తనను ముఖ్యమంత్రిగా నియమిస్తానని చెప్పిందన్నారు. అధిష్టానం ఇచ్చిన హామీ కారణంగానే తాను పదవిని అడుగుతున్నానని చెప్పారు. లేకుంటే తాను అడిగేవాడిని కాదన్నారు. తాను నలభై ఏళ్ల పాటు శ్రమించి నిర్మించిన బిజెపిని విడిచి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లనన్నారు.
కాగా ముఖ్యమంత్రి సదానంద గౌడపై ఆయన పరోక్ష విమర్శలు చేశారు. కాగా సదానంద గౌడ వచ్చి యడ్డీకి స్వీట్ తినిపించడం విశేషం. ఆయనను వెన్నుపోటుదారుగా అభివర్ణించారు. కాగా అప్పట్లో యడ్యూరప్ప గద్దె దిగేటప్పుడు తాను మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం గమనార్హం. అయితే తనకు అత్యంత అప్తుడైన సదానంద గౌడ పేరును యడ్డీ ముఖ్యమంత్రి పేరుకు ప్రతిపాదించారు. యడ్డీ సూచించిన వారికే అధిష్టానం పట్టం కట్టింది. అయితే యడ్డీ ఏరికోరి ప్రతిపాదించిన సదానంద గౌడ మాత్రం ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం వదులుకునేందుకు ససేమీరా అంటున్నారు.
మొత్తానికి యడ్డీ తన బెట్టును వీడి అధిష్టానానికి సరెండర్ అయ్యాడని, ఇక ఆయన కొత్త పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదంటున్నారు. మరి దీంతోనైనా కర్ణాటక సమస్య సర్థుమనుగుతుందో లేదో చూడాలి....
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more