సమాచార హక్కు కమిషనర్ల జాబితాలో నలుగురి నియామకాన్ని గవర్నర్ తిరస్కరించడంతో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. గవర్నర్ ఆమోదించిన నలుగురితోనే ప్రస్తుతానికి సరిపుచ్చాలా లేక నలుగురు కొత్తవారిని ఎంపిక చేయాలా లేక గవర్నర్ తిరస్కరించిన జాబితానే మరోసారి గవర్నర్ ఆమోదానికి పంపించాలా అన్న అంశాల చుట్టూ ప్రభుత్వ ఆలోచనలు సాగుతున్నట్లు సమాచారం.
అధిష్ఠానం వద్ద గవర్నర్ నరసింహన్‌కు ఉన్న పలుకుబడి దృష్ట్యా ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి నడుచుకునే అవకాశాలు లేవని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే గవర్నర్ అనుసరించిన వైఖరి పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సమాచార హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఒక మంత్రితో కూడిన కమిటి సమాచార హక్కు కమిషనర్లను ఎంపిక చేసి పంపిస్తే ఆ జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేసి తీరాల్సిందేనని, జాబితాను గాని, జాబితాలోని కొందరిని గాని తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయంలో గవర్నర్‌తో ఘర్షణకు ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని వారంటున్నారు.
సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక పట్ల మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పిసిసి అధ్యక్షునితో సహా అనేక మంది అధిష్ఠానవర్గానికి ఫిర్యాదులు చేశారు. సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక ప్రతినిథి బృందం గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తూ, కమిషనర్ల నియామకానికి సంబంధించిన ఫైలు మీద సంతకం పెట్టవద్దని కోరారు. కమిషనర్ల ఎంపికపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధిష్ఠానవర్గానికి వివరణ ఇచ్చుకోవలసి ఉంటుందని ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో స్పందిస్తూ, ‘పార్టీ వేరు, ప్రభుత్వం వేరు’ అన్నారు. రేణుకాచౌదరి ఆ విషయాన్ని చెప్పినపుడే అధిష్ఠానవర్గానికి ముఖ్యమంత్రి వివరించి ఉండాల్సిందని అంటున్నారు. అలాగే ఐక్య వేదిక ప్రతినిధులు గవర్నర్‌కు వినతిపత్రాన్ని సమర్పించినపుడు ముఖ్యమంత్రి కూడా గవర్నర్‌ను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసిన జాబితాకు నిబంధనల ప్రకారం గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి ఉన్నందున ఆ నమ్మకంతోనే ముఖ్యమంత్రి ఉండి ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
కారణం ఏదైనా, కారకులు ఎవరైనా గవర్నర్ నిర్ణయంతో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగలడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టకు భంగం ఏర్పడిందన్న అభిప్రాయం ముఖ్యమంత్రి సన్నిహితులతో సైతం ఏర్పడుతోంది.
ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే .. అసలు సమాచార హక్కు కమిషనర్ల జాబితాలో కూడా చంద్రబాబు హస్తం ఉందని తెలుస్తుంది. ముఖ్యమంత్రి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి .. బాబు కుమ్మకైనట్లు తెలిసింది. అధికారం పక్షం .. ప్రతిపక్షం .. ఒకటై.. సమాచార హక్కు కమిషనర్ల జాబితాను .. గవర్నర్ కు పంపించినట్లు తెలుస్తుంది. ఆ నలుగురిలో .. ఇద్దరు చంద్రబాబు పంపించిన పేర్లు ఉన్నాయని అంటున్నారు.
ఏదో సామెత మాదిరిగా దొంగలు దొంగలు వుళ్ళు పంచుకున్నారనే విధంగా చంద్రబాబు .. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహర శైలి ఉందని ప్రజలు అంటున్నారు. చంద్రబాబు సూచించిన పేరు ముత్తంశెట్టి విజయ నిర్మల సమాచార హక్కు కమిషనర్ల జాబితాలో చేర్చటంపై చంద్రబాబు మౌనంగా ఉన్నాడని తెలుస్తుంది.
బాబు మౌనం వెనుక .. కిరణ్ కుమార్ రెడ్డి .. నెల్లూరు నారాయణ కాలేజీ విషయంలో బాబు కు ఉపయోగపడ్డాడని, అందుకే సమాచార హక్కు కమిషనర్ విషయంలో మౌనం వహించక తప్పలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రతిపక్షం లో ఉన్న నాయకుడు ..అధికార పక్షంతో కలిసి .. ఇలాంటి పనులు చేయటంలో.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో .. ప్రజలందరికి అర్థమైందని సీనియర్ నాయకులు అంటున్నారు. ఏమైనా బాబు అవీనితి రుచి మరిగిన ..మనిషి...కిరణ్ ఆ రుచి కోసం ఆరాటపడుతున్న వ్యక్తి .. ఈ ఇద్దరిది ఒక్కటే జిల్లా కావటంతో.. బుద్దుల కూడా ఒకేలాగ ఉన్నాయి అంటున్నారు. పార్టీలు వేరైన .. ఈ ఇద్దరి కులం ఒక్కటే..( అంటే ..రాజకీయ కులం) అని ప్రజలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more