ప్రాణంలో ప్రాణంగా మెలిగిన స్నేహితులు కత్తులు దూసుకునే శత్రు వులుగా మారవచ్చనేందుకు జయలలిత-శశికళలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం చేపట్టిన ఆర్నెళ్లలోనే.. మూడు దశాబ్దాలుగా తన వెన్నంటి ఉన్న ‘ఇష్టసఖి’ శశికళతో జయలలిత తెగదెంపులు చేసుకున్నారు. పోయెస్ గార్డెన్ నుంచి ‘చిన్నమ్మ’ను మెడపట్టి గెంటేయించారు. ‘మన్నార్‌గుడి’ మాఫియాతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని పార్టీ నేతలకు హుకుం జారీ చేశారు. ఇది గత ఏడాది డిసెంబర్‌లో జరిగింది. శశికళ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని తొలగించినట్లుగా వార్తలు వెలువడినా.. వేటు వెనుక బలమైన కారణమే ఉందని తాజాగా అవగతమవుతోంది.
జయ-శశికళల స్నేహం మొదలైందిలా..
చెన్నైలో వీడియోపార్లర్ నడుపుతున్న శశికళతో జయకు 1982లో పరిచయమైంది. అప్పుడు పార్టీ ప్రచార కార్యదర్శి పదవిలో జయ ఉన్నారు. 1987లో ఎంజీఆర్ చనిపోవడంతో జయలలిత, శశికలల స్నేహం బయటి ప్రపంచానికి తెలిసింది. జయతో సన్నిహితంగా ఉండొద్దని చెప్పిన భర్త నటరాజన్‌ను కూడా శశికళ కొద్ది రోజులు దూరం పెట్టారంటే వారి మధ్య అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చు. 1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు శశికళ హవాకు ఎదురేలేకుండాపోయింది. సీనియర్ మంత్రులైనా, అధికారులైనా జయలలితను కలుసుకోవాలంటే తన ఆశీర్వాదం తీసుకోవాల్సిన పరిస్థితిని శశికళ సృష్టించారు. అయితే.. 1996లో అక్రమార్జన కేసు వారి మధ్య వివాదానికి దారి తీసింది. కొద్దిరోజులు ఎడమొహం పెడమొహంగా ఉన్నా.. మళ్లీ ఒక్కటయ్యారు. శశికళ సొంతూరు మన్నార్‌గుడి ..దీంతో ఆమె సంబంధీకులను అందరూ ‘మన్నార్‌గుడి’ మాఫియాగా అభివర్ణించేవారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె ‘సహచరి’ శశికళ స్నేహబంధం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆ ప్రాణ సఖి శశికళ వల్లే తనకు ముప్పు ఉందని భావిస్తున్న జయలలిత ఆమెను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాతికేళ్ల పైబడిన స్నేహబంధం వారిది. జయలలిత అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ ఇద్దరూ అడుగులో అడుగేసి నడిచారు. జయలలితకు సర్వస్వం ఆమే…అన్న విధంగా శశికళ ఎదిగారు. ఒక్క శశి మాత్రమే కాదు.ఆమె భర్త నటరాజన్, ఇతర కుటుంబ సభ్యులు జయలలిత ఫ్యామిలీగానే గుర్తింపు పొందారు. అయితే, కొంతకాలం క్రితం జయలలిత ఈ స్నేహబంధాన్ని హఠాత్తుగా తుంచేసు కున్నారు. ఇంటి నుంచి బయటికి గెంటేశారు. శశికళను, ఆమె భర్త నట రాజ న్‌ను, బంధువర్గం మొత్తాన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. జయ లలిత ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది. తను ప్రాణప్రదంగా చూసుకున్న శశికళ తనకే ఎసరు పెట్టబోతోందని జయ లలిత గ్రహించారు
రాజ్యాంగేతర శక్తి..శశికళ
మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని జయలలిత అధిష్టించిన తర్వాత శశికళ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలను శాసించారు. నియామకాలు, బదిలీలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. జయ చుట్టూ తన సంబంధీకులతో ఏర్పాటు చేసిన చట్రం సహాయంతో ఈ విషయాలన్నీ ఆమెకు తెలియకుండా శశికళ జాగ్రత్తలు తీసుకున్నారు.
మోడీతో ఇచ్చిన క్లూతో కుట్ర బట్టయలు!
అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తనను ఆ పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతోందని జయలలిత గ్రహించారు. జయలలితపై ఉన్న కేసులు కనక రుజువైతే ఆమె పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని, అప్పుడు నటరాజన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కుట్ర పన్నారు. సరైన పథక రచనలేని ఈ కుట్రకు సూత్రధారి శశికళే. .తనను సీఎం పదవి నుంచి కూలదోసి, శశికళ భర్త నటరాజన్‌ను సీఎం చేయడానికి పథకం సిద్ధం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండమని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జయలలితను హెచ్చరిం చారు. జయలలిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కొన్ని నెలలకే మోడీ ఈ హెచ్చరిక చేశారు. చుట్టూ ఉన్నవారితో, ముఖ్యంగా శశికళ విషయంలో జాగ్రత్త గా ఉండమని హితవు చెప్పారు.
నరేంద్రమోడీ జయలలితకు ఈ హెచ్చరిక చేయడానికి వెనక కొంత కథ నడిచింది. జయలలితకు, మోడీకి ఎప్పటి నుంచో రాజకీయంగా మంచి సంబం దాలున్నాయి. కొంతకాలం కిందట గుజరాత్‌లో ఓ ఎన్‌ఆర్‌ఐ పారిశ్రామికవేత్త ఓ ప్రాజెక్టును నెలకొల్పేందుకు తమిళనాడు వెళ్లారు. అక్కడ ఏ పని జరగాలన్నా మన్నార్‌గుడి మాఫియా (ఎంఎం) అండలేందే జరగదని తెలిసింది. మన్నార్ గుడి మాఫియా అంటే ఎవరో కాదు, శశికళ అండ్ కో మొత్తం ప్రాజెక్ట్ విలు వలో తమకు 15 శాతం కమీషన్ ఇవ్వాలని శశికళ బృందం డిమాండ్ చేసింది. ఆ ఎన్‌ఆర్‌ఐ గుజరాత్ వెళ్లి నరేంద్రమోడీకి చెప్పారు. మోడీ వెంటనే ఈ సంగతి జయలలితకు చెప్పారు. మోడీ చెప్పడంతో జయలలితకు శశికళ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. చెనై మోనోరైల్ ప్రాజెక్టుపై సంప్రదింపులు జరుగుతున్న సమయంలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
సింగపూర్‌లో పరిశ్రమలున్న ఆ ఎన్‌ఆర్‌ఐకే ఈ ప్రాజెక్టు ఇద్దామని సీఎం భావించారు. రాతకోతలన్నీ పూర్త య్యాక తన వద్దకు వచ్చిన ఫైల్‌ను చూసి జయలలిత షాకయ్యారు. ఈ కాం ట్రాక్ట్‌కు మరో కంపెనీకి ఇవ్వాలంటూ మలేసియా ప్రభుత్వం ఆదేశిస్తున్నట్టు ఆ ఫైల్ తయారై వచ్చింది. పైగా, ఆ కాంట్రాక్ట్‌ను మలేసియా కంపెనీకి ఇవ్వాలని తమిళనాడు సీఎం రాసినట్టు ఫైల్‌లో ఉంది. సంతకాలూ ఉన్నాయి. శశికళపై అనుమానం బలపడింది. ఫైల్‌పై సంతకాలు ఎవరివని శశికళను నిలదీశారు. శశికళ తనకు తెలీదని చెప్పారు. దీనితో ఒకరిపట్ల ఒకరికి విశ్వాసం సన్నగి ల్లింది. శశికళపై అనేక భూకుంభకోణాల కేసులున్నాయి. ఆ కేసుల చిట్టా అంతా జయలలిత వద్ద ఉంది. మన్నార్‌గుడి మాఫియా గుట్టంతా జయలలిత తన చేత చిక్కించుకున్నారు. మోడీ సలహాతోనే జయలలిత జాగ్రత్త పడ్డారని తెలుస్తోం ది. శశి బయట ఉంటే తనకు ముప్పని గ్రహించి ముందు జాగ్రత్తగా, ఈ కేసుల్ని చూపి జయలలిత శశికళను అరెస్ట్ చేయవచ్చని అనుకుంటున్నారు
జయకు స్లో పాయిజన్!
శశికళ వ్యవహారంతో అనుమానం వచ్చిన జయ తాను తినే ఆహార పదార్థాలను వైద్యులతో పరీక్షింపజేశారు. అందులో స్వల్పమోతాదులో మత్తు, ఇతర రసాయన, విష పదార్థాలు ఉన్నట్లుగా తేలింది.తనకు ఆహార పదార్థాలను, మందులను వేసేందుకు నియమించిన నర్సు ద్వారా శశికళ ఈ పని చేయించినట్లుగా జయ గుర్తించారు. ఆ నర్సును శశికళే నియమించడం గమనార్హం. సీఎం పీఠంపై కన్నేసిన శశికళ.. ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనే విషయం జయకు అవగతం కావడంతో ఆమెతో పాటు కుటుంబసభ్యులను పార్టీ నుంచి గెంటివేశారని ఒక పత్రిక వ్రాసింది..
శశికళ సోదరుడి అరెస్టు
శశికళ చిన్న తమ్ముడు దివాకరన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తిరువరూరు జిల్లా రిషియూరు గ్రామంలో ఓ మహిళకు చెందిన ఇంటిని దివాకరన్ అక్రమంగా కూల్చివేశాడని వారు కేసు నమోదు చేశారు. ఈ నెల 16 వరకు ఆయన పోలీస్ కస్టడీలో ఉంటారు.
ఇది మంచి ప్రాణ మిత్రుల కథ? చివరకు ఎటు చేరుతుందో చూడాలి? పదవి, ప్రపార్టీ కోసం మనిషి తన స్నేహానికి కూడా హనీ చేయ్యటానికి వెనకడుగు వేయరాని అర్థమవుతుంది. సో... తస్మాత్ జాగ్రత్త... సుమా...
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more