గత సంవత్సరంలో టాలీవుడ్ లో స్టైలిస్ హీరో అల్లు అర్జున్ పెళ్లి చేసుకోవటంతో.. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన పెళ్లి ముచ్చట తీర్చుకున్నాడు. ఆ సంవత్సరం మొదలైన టాలీవుడ్ పెళ్ళిళ్ళ పండుగ సీజన్ ఈ సంవత్సరం కూడా ప్రారంభమువుతున్నయాని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తున్నటుంది. హీరోలు, హీరోయిన్స్ వరసగా పెళ్లిళ్లుకు రెడీ అవుతున్నారు. ఇలా పెళ్ళి చేసుకోబోతున్న హీరోయిన్లలో పలువురు ఇక తెరపై నటనకు స్వస్తి పలుకనున్నారు. మరి కొందరు మాత్రం పెళ్ళయినా సినిమాల్లో నటిస్తామంటున్నారు..రోజులు మొదలుకొని నెలల వ్యవధిలో పలువురు సినీతారల వివాహాలు జరుగనున్నారు. కొంత మంది శుభలేఖలు పంచడంలో బిజీగా ఉండగా, మరికొందరు బ్యాచిలర్ పార్టీలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టాలీవుడ్ పెళ్ళిళ్ళ ప్రత్యేక కథనం.
జూన్‌లో ఒకింటివాడు కానున్న రామ్ చరణ్
సినీ నటుడు రామ్‌చరణ్ పెళ్లి జూన్‌లో హైదరాబాద్‌లో ఉంటుందని అపోలో ఆస్పత్రుల చెర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉపాసన, రామ్‌చరణ్‌లది చక్కని జంట అని ప్రశంసించారు. పెళ్లి ఏర్పాట్లు భారీ ఎత్తున చేస్తున్నామన్నారు. తనకు తిరుపతి పుట్టినిల్లు లాంటిదని చిరంజీవి చెప్పడంతో దైవం చెంతనే రిసెప్షన్‌ను తన స్వగ్రామమెన అర్ధగిరిలో ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.ఇందుకు చిరంజీవి కూడా సుముఖత తెలిపారన్నారు. తిరుమల వెంకన్న, కాణిపాకం వినాయకుడు, అర్ధగిరి ఆంజనేయుడి ఆశీస్సులు నవదంపతులకు ఉంటాయన్నారు. అంతకు ముందు ఆయన కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.
బ్యాచిలర్ లైఫ్‌కు వీడ్కోలు ఆర్యన్ రాజేష్
దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ కుమారుడు, నటుడు ఆర్యన్ రాజేష్ నిశ్చితార్థ వేడుక తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడులో జనవరి 30న ఘనంగా జరిగింది. ఈ గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ కంటిపూడి అమరనాథ్ కుమార్తె సుభాషిణిని రాజేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు అల్లరి నరేష్, ఉదయ కిరణ్, వెంకట్, బాలాజీ, చలపతిరావు, ఎల్.బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ, జీవా తదితరులతో పాటు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు మాగంటిబాబు, గోరంట్ల బచ్చయ్య చౌదరి తదితరులు హాజరయ్యారు. ఈ నెల 10న వివాహం చేసుకోబోతున్నాడు. ఇదిలా ఉంటే పెళ్లి ముందు రాజేష్ తన సన్నిహితు లకు, స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
సినీ జీవితానికి స్వస్తి సంఘవి
పెళ్ళి బాట పట్టిన తారల వరసలో తెలుగు మాజీ హీరోయిన్ సంఘవి చేరింది. రామానాయుడు బ్యానర్ లో ‘తాజమహల్’ చిత్రంతో పరిచయమైన ఆమె తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 95 చిత్రాలు దాకా చేసింది. ఆమె వివాహం అమెరికాలో డాక్టర్ గా చేస్తున్న వ్యక్తితో జరగనుంది. మార్చి 5, 2012న ఈ వివాహం జరగనుంది. వివాహం చెన్నైలోనే జరగనుంది. అయితే వెన్యూ వివరాలు తెలియరాలేదు. వివాహానంతరం తన సినీ జీవితానికి స్వస్తి చెప్పి అమెరికాలో సెటిల్ కానుంది. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ.. తన వైవాహిక జీవితం శుభ ప్రధంగా జరుగుతుందని భావిస్తున్నానని, తనను అర్దం చేసుకునే వ్యక్తి భర్తగా దొరకటం అదృష్ట్టమంటోంది.
శుభలేఖలు ఇచ్చే పనిలో గోపీచంద్
‘శుభలేఖలు వచ్చేశాయి. ఇక పంచడమే తరువాయి. పెళ్లి తరవాతే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటాను’’ అంటున్నారు గోపీచంద్ చెప్పారు. గోపీచంద్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24న ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆస్ట్రేలియాలో ఎంబీఏ చదువుకొన్న హరితను వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక.. గోపీచంద్ హీరోగా బాలాజీ రియల్ మీడియా ప్రై.లి. సంస్థ జి.భూపతి పాండ్యన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలి సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు క్లాప్ కొట్టారు. ఎస్.ఎస్.రాజమౌళి స్విచ్చాన్ చేశారు.
పెళ్ళిపీటలపై రీమాసేన్
‘చిత్రం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ రీమాసేన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా మీడియాకు తెలియ చేసింది. గతంలో పలుమార్లు తన ఎంగేజ్ మెంట్, ప్రేమ, వివాహ విషయాలును ఖండించిన ఆమె తన వివాహ తేదీని ప్రకటించింది. ఆమె మార్చి 11న తన చిరకాల బోయ్ ఫ్రెండ్ ప్రముఖ రెస్టారెంట్ యజమాని శివకరణ్ సింగ్‌ని వివాహం చేసుకుంటోంది. న్యూ డిల్లీలోని శివకు చెందిన ఫామ్ హౌస్‌లోఈ వివాహం జరగనుంది. పంజాబీ, బెంగాలీ సంప్రదాయాల కలబోతగా ఆ వివాహాన్ని ఆమె చేసు కుంటోంది. ఇక శివకు ఢిల్లీలో మోచ్చా, స్మోక్ హౌస్ వంటి అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. రీమాసేన్ సినిమాల విషయానికి వస్తే ఆమెకు ‘మనసంతా నువ్వే’ చిత్రం తర్వాత తెలుగులో పెద్ద హిట్టు ఒకటీ పడలేదు. రీసెంట్‌గా కూడా వియన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ‘ముగ్గురు’లో ఓ కీ రోల్ ని చేసింది. ఆ సినిమా ఫెయిల్యూర్ అవ్వటంతో ఆమెను పట్టించుకున్నవాళ్లు లేరు. తమిళం లోనూ ‘యుగానికి ఒక్కడు’ వంటి పెద్ద సినిమాలు చేసినా అక్కడా రావలసినంత క్రేజ్ రాకుండా పోయింది. దాంతో ఆమె మాతృరాష్ట్రం బెంగాలీకి వెళ్లి అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఆమె బెంగాలీలో చేసిన ఓ సినిమాను ఆ మధ్యన తమిళంలో డబ్ చేసి విడుదలకు ప్లాన్ చేసినప్పు డు రాంగ్ పబ్లిసిటీ చేస్తున్నారంటూ ఆమె గొడవ కూడా చేసింది.
పెళ్ళి తరువాత కూడా సినిమాల్లో నటిస్తా... స్నేహ
అందాల భామ స్నేహ పెళ్లికి ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. తమిళ నటుడు ప్రసన్నను ఈ సుందరి త్వరలో పెళ్లాడనుంది. మేలో పెళ్లికి ముహూర్తం ఖరారు చేసినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. అయితే పెళ్లి తర్వాత స్నేహ సినిమాలకు గుడ్‌బై చెప్పనుందనే విషయం ఈ స్మైలీ బ్యూటీ అభిమానుల్ని కలవరపెడుతోంది. పెళ్లి తర్వాత స్నేహ సిని మాల్లో నటించడం ప్రియుడు ప్రసన్నకు ఇష్టం లేదని, దాంతో వివాహాన్ని వాయిదా వేసుకునే ఆలోచనలో ఈ జంట వుందని తమిళ పత్రికల్లో వార్త లు వెలువడ్డాయి. దీంతో కలవరపడ్డ ప్రసన్న ఇటీవల చైన్నైలో పాత్రికే యుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. మా పెళ్లి వాయిదా పడిందన్న వార్తల్లో వాస్తవం లేదు. అనుకున్న సమయం ప్రకారం మా పెళ్లి జరు గుతుంది. పెళ్లయ్యాక కూడా స్నేహ సినిమాల్లో నటించాలన్నదే నా అభిమతం. స్నేహ చాలా టాలెంటెడ్ హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకెంతో మంది అభిమానులున్నారు. నటిగా ఆమో అభిప్రాయాల్ని గౌరవిస్తాను. ఆమె సినిమాల్లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. సినిమా కెరీర్ విషయాల్లో నా ఆమెప్పుడు నా సపోర్ట్ వుంటుందని ప్రసన్న మీడియాకు తెలిపాడు. వివాహానంతరం సినిమాల్లో నటిస్తానని, ప్రసన్నలాంటి అర్థం చేసుకునే వ్యక్తిని పెళ్లాడబోవటం తన అదృష్ట్టమని స్నేహ కూడా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సుందరి రజనీకాంత్ కొచ్చాయడన్, శరత్‌కుమార్ విధి చిత్రాల్లో నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more