రాష్ట్రంలో అధికారంలో ఉన్నకాంగ్రెస్ పార్టీ లో కొత్త గా ‘కుల’ పంచాయితీలు నిప్పులు రాసుకుంటున్నాయి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత రాష్ట్రంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అంతే కాకుండా .. రాజకీయ నాయకులలో కూడా కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయట. ఎవరి వర్గం వారు ఆ వర్గానికే పీఠ వేయ్యాలని చూస్తున్నారట. ఇదంతా మొన్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తన అధికార బలంతో.. అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసి .. తన వర్గానికి మేలు చేసే విధంగా ముందుకు పోతున్నాడట. అయితే తన మాట వినని మంత్రులను తన కేబినెట్ నుండి తొలగించాలని ఎప్పటి నుండి సీఎం అనుకుంటున్నారట. అదీ కూడా మొన్న కాపు వర్గాని చెందిన ఇద్దరు మంత్రులను సీఎం కేబినెట్ లోకి తీసుకోవటంతో.. సీఎం పని సులువుగా జరిగిందని అంటున్నారు. సీఎం అనుకున్నట్లుగానే మొదటిగా దళితుడైన పి. శంకర్రరావు పై వేటు వేశాడు. అసలు దళితుడైన శంకర్రారావు పై ఎందుకు వేటు వేశాడంటే.. అందుకు ఆయన నా మాట వినటంలేదని, జగన్ పై విమర్శలు చేస్తున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ... అధీష్టానం కూడా శంకర్రరావును తొలగించమని సీఎం అంటున్నాడట.
దళితులకు అండగా ఇప్పడు ఉప ముఖ్యమంత్రి సి. దామోదర రాజనర్సింహ పావులు కదుపుతున్నాడట. తమ దళిత కులాలైన, మాల, మదిగలను ఒకటి చేసి .. వారి బలంతో..ముందుకు పోవాలని చూస్తున్నాడట. అందుకు అనుగుణంగా ఢిల్లీలో మంతానాలు జరుపుతున్నాడని .. కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు. కుల సమీకరణాలను అందిపుచ్చుకుని.. తన వర్గాన్ని సమీకరించుకుని.. రాజకీయంగా తన బలాన్ని, బలగాన్ని నిరూపించుకునే దిశగా ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనర్సింహ అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా తన శక్తి సామర్థ్యాలను బహిర్గతపరచేందుకు సమాయత్తమవుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తోన్న కుల రాజకీయాలను తనకు సానుకూలంగా మలచుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారట. ఇందుకు 'సమ్మేళనాల'ను వేదికగా చేసుకుంటున్నారట. ఇందులో మొదటిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దళితులు తమ ఆరాధ్యుడిగా కొలుస్తున్న సంత్ రవిదాస్ సమ్మేళనాన్ని నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి సి. దామోదర రాజనర్సింహ నిర్ణయించుకున్నాడట..
ఉప ముఖ్యమంత్రి సి. దామోదర రాజనర్సింహ వచ్చే నెల 19న లాల్‌బహదూర్ స్టేడియంలో దాదాపు లక్ష మంది దళితులతో ఈ అంతర్జాతీయ సమ్మేళనాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయాని . దీనికి ఎవరెవరిని ఆహ్వానించాలన్న విషయమై ఇంకా నిర్ధారణకు రాకలేదని .. లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేలను ఆహ్వానించాలన్న యోచనలో ఉన్నారని సమాచారం. అలాగే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్, సీఎం కిరణ్‌లను ఆహ్వానించడంపైనా ఆలోచన చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
ఉప ముఖ్యమంత్రి సి. దామోదర రాజనర్సింహ ధార్మిక చింతన ద్వారా సామాజిక అసమానతలను తొలగించాలన్న ఉద్దేశంతో ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నా దళితుల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి సి. దామోదర రాజనర్సింహ చెబుతున్నారట. ఆత్మ గౌరవ నినాదంతో దళితులందరినీ ఒక్కటి చేయడమే అసలు లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి సి. దామోదర రాజనర్సింహ అంటున్నారట. ఇదే క్రమంలో కోస్తా ప్రాంతంలోనూ ఈ ఏడాది మార్చి మూడో వారంలో మరో దళిత సమ్మేళనాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో దామోదర రాజనర్సింహ ఉన్నారని ఆయన మిత్రులు అంటున్నారు.
అయితే ఉప ముఖ్యమంత్రి సి. దామోదర రాజనర్సింహ ఈ సభను రాజమండ్రి లేదా గుంటూరులో నిర్వహించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారట. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా దళిత సమ్మేళనాలను నిర్వహించడం ద్వారా ఆ వర్గాన్ని ఒక్కటిగా చేయడంతోపాటు తమ బలాన్ని.. బలగాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనలో రాజనర్సింహ ఉన్నారని అంటున్నారట. దీంతో ఉప ముఖ్యమంత్రి రాజకీయ ఎత్తుగడ రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో.. ఎలాంటి పరిణామాలకు వేదికగా మారుతుందోనన్న ఆసక్తి నెలకొంది..
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more