తెలుగు దేశం పార్టీకి ..దివంగత వైఎస్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి కష్ట కాలం మొదలైందట. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో ఒక సమస్య తెలుగుదేశం పార్టీని పట్టిపిడీస్తున్నాయట. ఆ పార్టీలో అందరు కలిసి ఒకటిగానే కనిపిస్తారు? కానీ ఎవరి బాధలు వారివేనట. తెలంగాణ కోసం కొంతమంది మద్దతు ఇస్తే .. మరి కొంత మంది సమైకాంధ్రాకు మద్దతు ఇస్తున్నారట. తెలంగాణ సమస్య చల్లబడిందిలే అనుకుంటే .. పార్టీలో మరొ కొత్త సమస్యలు వచ్చి పడున్నాయట. మొన్నటికి మొన్న చంద్రబాబు పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అలగటం అందరికి తెలిసిందే. ఇలా ఏదో ఒక సమస్యలతో తెలుగు దేశం పార్టీ ఆ విధంగా ముందుకు పోతుందట.
తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీట్ల సందడి మొదలైందట. ఈసారి సీట్లను ఆశిస్తున్న అభ్యర్థులు తమ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారట. పార్టీ అధినేత మనసులో ఏముందో బయటకు వెల్లడి కాకపోవడంతో ఆయన మనోగతాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయని. అయితే నామినేషన్ల ప్రక్రియ మార్చి నెలాఖరులో జరిగే అవకాశం ఉందని. అసెంబ్లీలో టీడీపీ సంఖ్యాబలం ప్రకారం ఆ పార్టీకి రెండు సీట్లు దక్కే అవకాశం ఉందట. ఇందులో సీమాంధ్రకు ఒకటి, తెలంగాణకు మరొకటి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందట.
సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంవి మైసూరారెడ్డి ఈసారి రిటైరవుతున్నారట. ఆయనకు మళ్ళీ అవకాశం ఇస్తారా లేక ఆ ప్రాంతం నుంచి మరొకరికి అవకాశం దక్కుతుందా అన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట. సామాజిక వర్గ కోణాల్లో మైసూరాకు అవకాశం ఇవ్వక తప్పదని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారట. కొంతకాలం క్రితం కడప లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా మైసూరా రెడ్డిని నిలిపి విషయం తెలిపిందే. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయనే అభ్యర్థి అని ముందుగానే చెప్పారట. ఈ కారణం వల్ల ఈసారి ఆయనకు రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేయకపోవచ్చన్నది కొందరు నాయకుల వాదన వినిపిస్తుందట. అయితే మైసురా మాత్రం రాజ్యసభ సభ్యత్వానికే మొగ్గు చూపుతున్నారట. ఆయనకు అవకాశం రాని పక్షంలో.. రాజ్యసభ సభ సభ్యత్వాన్ని కోరుతున్న వారి సంఖ్య సీమాం«ద్రుల సంఖ్య గణనీయంగానే పెరుగుతుందట. మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు ఈ జాబితాలో ముందు వరసలో ఉన్నారట. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడం ద్వారా యనమాల అందరికంటే ఓ అడుగు ముందున్నారట. కడప జిల్లాకే చెందిన పార్టీ ఉపాధ్యక్షుడు, పారిశ్రామికవేత్త సీఎం రమేష్ కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు.
తెలుగు దేశం పార్టీ నాయకుడు కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు ఈసారి తప్పక అవకాశం వస్తుందన్న నమ్మకంతో కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు ఉన్నారట. మాజీ కేంద్ర మంత్రి ఎర్రన్నాయుడు కూడా రాజ్యసభపై కోరికతో ఉన్నా రెండేళ్ళలో సాధారణ ఎన్నికలు ఉన్నందున ఆయనకు అవకాశం రాకపోవచ్చని కొంత మంది ముందుగానే సంకేతకాలు ఇస్తున్నారట. అయితే అదే ప్రాంతం నుంచి రాజ్య సభ సీటు కోసం ఆశిస్తున్నవారిలో పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి టిడి జనార్దనరావు, కంభంపాటి రామ్మోహనరావు, వర్ల రామయ్య, కృష్ణబాబు, లాల్‌జాన్‌బాషా, ఇంక కొంతమంది ఉన్నారని ఎన్టీఆర్ కార్యలయంలో నాయకులు అనుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా రాజ్య సభ సీటు కోసం చాలా మంది ముందు వరుసలో ఉన్నారని తెలుస్తుందట. గతంలో తెలంగాణ నుండి రాజ్య సభకు రేసులో ఉన్న దేవేందర్ గౌడ్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస యాదవ్ ఇప్పుడు తమ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టి పనిచేసుకొంటున్నారట. అయితే వారు పేర్లు కూడా పరిగణనలోకి వస్తాయా లేదా అన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి తెలుగు దేశం పార్టీలో ఉందట. టిడిపి బాగా అండగా ఉంటూ వచ్చిన వరంగల్ జిల్లా నేత గరికపాటి మోహనరావు ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తుంది..
అయితే తెలుగు దేశం ఈ సమస్యను నుండి ఎలా బయటపడుతుందోనని .. ఆ పార్టీ నాయకులు ఎదురు చూస్తున్నారట. 'ఒక ప్రాంతంలో అగ్ర వర్ణానికి అవకాశం వస్తే రెండో ప్రాంతంలో బలహీనవర్గాల వారికి అవకాశం వస్తుందట. ఇందులో అనేక రకాల సమీకరణాలు చోటు చేసుకొనే అవకాశం ఉందని . ఆఖరు నిమషం వరకూ సీటు దక్కేవారెవరో తేలకపోవచ్చు' అని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. అయితే టిడిపి నుండి రాజ్య సభ సీటు దక్కించుకొని నేతలెవరో వేచి చూద్దాం. ఆ రెండు సీటులు ఎవర్ని వరిస్తుందోనని టిడిపి నాయకలు పార్టీ ఆపీసు చూటు తిరుగుతున్నారట.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more