మన చేతిలో ఏం ఉండదండీ.. అంతా అలా జరుగుతుంది. ఏదీ ఏమైనా జనం మెచ్చింది మనం చేయాలి. అంతే కానీ మనం చేసింది జనం చూడరు. నేను కష్టపడి చేసినవన్నీ జనానికి నచ్చాయి. నేను నటించిన సినిమాలు అన్నీ కలిసొచ్చాయి అంటున్నది ఎవరో కాదు మన విక్టరీ వెంకీ.
వెంకటేష్ బాడీగార్డ్ సినిమా చాలా నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే బాడిగార్డ్ కంటే ముందు సినిమా ‘నాగవల్లి’భారీ అంచనలతో తీసిన వెంకటేష్ అంచనాలను తారుమారు చేసింది. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అప్పటి నుండి వెంకటేష్ కొంచెం జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది.
అయితే వెంకటేష్ కు ఒక సెంటిమెంట్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. సంక్రాంతి రోజు సినిమా రిలీజ్ చేస్తే .. ఆ సినిమా మంచి హిట్ అవుతుందని వెంకటేష్ నమ్మకం. గతంలో కూడా అలాగే జరిగిందట. అందువలనే బాడీగార్డ్ ను సంక్రాంతి విడుదల చేయ్యటానికి సిద్దమయ్యడని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
ఇప్పుడు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సంతరించుకుంది. హిందీలో బాడీగార్డ్ సినిమా సల్మాన్ ఖాన్ హీరోగా నటించి, గోప్ప విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా చేసి గొప్ప విజయం సాధించాలని ఉన్నాడట. అలాగే తెలుగులో హిట్ అయిన సినిమా హిందీలో , హిందీలో హిట్ సినిమాలను తెలుగులో తీయ్యటం పరిపాటిగా మారిపోయింది. హీరోలు కూడా ..అలాగే మంచి ఉత్సహం కనపర్చుస్తున్నారు. హిందీలో దబాంగ్,ను తెలుగు పవన్ కళ్యాన్ గబ్బర్ సింగ్ పేరుతో తీస్తున్న విషయం తెలిసిందే. బాడీగార్డ్ సినిమా పై దర్శకుడు గోపీ చంద్ మలినేని మంచి ఆశలు పెట్టుకున్నారని ..వెంకటేష్ అభిమానులు అనుకుంటున్నారు.
సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విక్టరీ వెంకటేష్ చిత్రం `బాడీగార్డ్`. దర్శకుడు గోపీచంద్ మలినేని ఇవాళ కడప పెద్ద దర్గాను సందర్శించి `బాడీగార్డ్` చిత్రం ఘనవిజయం సాధించాలని ప్రార్థనలు జరిపిస్తున్నారట. దర్గా పై తనకెంతో నమ్మకముందని తన సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని గోపీచంద్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more