పక్కింటివాళ్ళతో గొడవ పడితే వాళ్ళ పిల్లలతో వీళ్ళ పిల్లలు ఆడుకోగూడదు. మనిషి పనికి రాకపోతే ఆ మనిషికి చెందినవారూ పనికిరారు. అలాగే సంవత్సరాలుగా సన్నిహితంగా మెలిగి, వారి స్నేహం మీద రకరకాల వ్యాఖ్యానాలు వచ్చినా లెక్కచేయకుండా కలిసి మెలిసి మెలిగిన శశికళకు తమిళనాడు ముఖ్యమంత్రి ఈ రోజు జయలలిత "కటీఫ్" చెప్పేసారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని శశికళ తోపాటు ఆమె భర్త నటరాజన్, ఆమె ముగ్గురు మేనలుళ్ళు పార్టీ సభ్యత్వం నుంచి తొలగించబడ్డారు. వీరితో పాటు మొత్తం 12 మంది జయ సన్నిహితులు సభ్యత్వాన్ని కోల్పోయారు.
శశికళను దూరం చేసుకోవటం ఇది మొదటిసారి కాదు. 1996లో డిఎమ్ కె ప్రభుత్వం ఇద్దరిమీదా అభియోగాలు మోపిన సమయంలో జయ తన స్నేహితురాలిని దూరంగా ఉంచారు. జైల్లో ఎలాగూ కలవలేదు. బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కూడా ఇంటికి వచ్చిన శశికళను లోపలికి రానివ్వలేదు.
సభ్యత్వంనుండి తొలగించటంతో వారంతా ప్రభుత్వంతో జోక్యం లేకుండా ఉంటారు. "అనవసరంగా ప్రభుత్వం యంత్రాంగంలో జోక్యం చేసుకుంటున్న కారణంగా వారిని తొలగించటమైన"దని ప్రకటనతో వారంతా మౌలిక సభ్యత్వం నుంచి తొలగించబడ్డారు.
శశికళను జయలలిత స్నేహితురాలికన్నా మిన్నగా చూసుకున్నారు. "నీ సుఖమే నే కోరుకున్నా, నిను వీడి అందుకే వెళ్తున్నా" అన్న తెలుగు సినిమా పాటలా, జయలలిత మరోసారి తన మీద ముంచుకొస్తున్న రాజకీయ ప్రమాద ఘంటికలను పసిగట్టి, తన స్నేహితులు ఆ ఊబిలోకి రాకుండా పెద్ద మనసుతో అందుకే దూరం చేసుకుంటున్నారేమోనని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more