Chiru, Salman take the stage in GodFather మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాద‌ర్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్..

Godfather chiranjeevi salman khan take the stage in godfather first single

Megastar, Chiranjeevi, God Father, salman khan, Thaar maar thakkar maar, Nayanthara, Puri Jagannadh, Satya Dev, first single, godfather Chiranjeevi first single, godfather salman khan Chiranjeevi single, godfather movie, godfather Chiranjeevi movie, godfather songs, Mohan Raja, Thaman, Tollywood, Movies, Entertainment

Chiranjeevi and Salman Khan will be seen together in GodFather, one of the most eagerly-awaited Telugu films of the year. The flick has garnered a fair deal of attention as it features the Tollywood Megastar in a new avatar. Now, here is an exciting update for those looking forward to the biggie. Its first single is out at 5:02 pm today, September 15, but with a small twist only the audio song is released in spotify app instead of lyrical song on social media.

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాద‌ర్’ నుంచి ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్..

Posted: 09/15/2022 08:11 PM IST
Godfather chiranjeevi salman khan take the stage in godfather first single

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ బాక్సాఫీసు వద్ద పెద్దగా సవ్వడి చేయకుండానే మెగా ఫ్యాన్స్ ను నిరుత్సాహపర్చగా.. వారంతా గాడ్ ఫాదర్ చిత్రంపైనే కొండంత ఆశలు పెట్టుకున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ ను ఉత్తేజపర్చేందుకు.. తానేంటో, తన నట విశ్వరూపమేంటో చూపేందుకు తన తదుపరి చిత్రం ‘గాడ్‌ ఫాద‌ర్‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ నుండి ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ వ‌ర‌కు అన్ని సినిమాపై అంత‌కంత‌కు అంచ‌నాల‌ను పెంచుతూనే ఉన్నాయి. మొహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో బిజీగా ఉంది.

పొలిటికల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మేక‌ర్స్ వ‌రుసగా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గాడ్‌ఫాద‌ర్’ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. గాడ్‌ఫాద‌ర్ నుంచి అటు సల్మాన్ ఖాన్ తో కలసి మెగాస్టార్ చిరంజీవి స్టెపులు ఇరగదీసే థార్ మార్ థక్కర్ మార్ అంటూ సాగే సింగిల్ లాంచ్ అయ్యింది. అయితే ఈ పాటపై ప్రోమో విడుదలతోనే హైప్ బాగా రావడంతో.. లిరికల్ వీడియోకు బదులుగా కేవలం ఆడియో సాంగ్ ను మాత్రమే చిత్రబృందం విడుదల చేసింది.

సాయంత్రం ఏడు గంటలకు థార్ మార్ థక్కర్ మార్ అంటూ సాగే సింగిల్ ఆడియోను ‘స్పాటిఫై’ యాప్ ద్వారా విడుదల చేసింది చిత్ర నిర్మాణసంస్థ కొణిదెల ప్రోడక్షన్స్. మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్ ఒకే డాన్సింగ్ ఫ్లోర్ ఫై ఈ పాటకు స్టెప్పులేసే ఫ్రోమోను రెండు రోజుల క్రితమే చిత్రయూనిట్ విడుదల చేసింది. అంతేకాదు అదే రోజున బాలీవుడ్, టాలీవుడ్ ఇద్దరు మెగాస్టార్లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో స‌ల్మాన్‌ఖాన్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుండ‌గా స‌త్య‌దేవ్, న‌య‌న‌తార కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles