'Dongalunnaru Jagratha' Trailer: First Telugu survival thriller ఆస‌క్తి రేకెత్తిస్తున్న శ్రీ సింహా ‘దొంగ‌లున్నారు జాగ్ర‌త్త’ ట్రైల‌ర్‌

Dongalunnaru jagratha trailer sri simha koduri fights for his life in a car in this unique survival thriller

Dongalunnaru Jaagratha, Theatrical Trailer, Simha Koduri, Samuthirakhani, Preeti Asrani, Satish Tripura, Kaala Bhairava, Suresh Productions, Guru films, Tollywood, Movies, Entertainment

Simha Koduri, the son of MM Keeravani, is now working on a new movie called Dongalunnaru Jagratha. The movie's creators are advertising it as Telugu's First Survival Thriller. simha is presented as a thief (Raju) who takes goods from the cars parked on the road in the trailer for the movie that was released.

ఆస‌క్తి రేకెత్తిస్తున్న శ్రీ సింహా ‘దొంగ‌లున్నారు జాగ్ర‌త్త’ ట్రైల‌ర్‌

Posted: 09/15/2022 09:04 PM IST
Dongalunnaru jagratha trailer sri simha koduri fights for his life in a car in this unique survival thriller

స్వర మాంత్రికుడు ఎం‌.ఎం కీర‌వాణి చిన్న కొడుకు శ్రీసింహా హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. శ్రీ సింహా ‘యమ‌దొంగ’ సినిమాతో ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. జూ.ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి క్యారెక్ట‌ర్‌లో న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడు అవుదామ‌ని ఉద్ధేశంతో సుకుమార్ ద‌గ్గ‌ర ‘రంగ‌స్థ‌లం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. అయితే అనూహ్యంగా హీరో అవ‌తార‌మెత్తి ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ చిత్రాన్ని చేశాడు. మొద‌టి సినిమాతోనే న‌టుడుగా గొప్ప ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు.

ఆ త‌ర్వాత ‘తెల్ల‌వారితే గురువారం’ ఎప్పుడు వ‌చ్చిందో కూడా ఎవ‌రికీ తెలియ‌కుండా వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ‘దొంగ‌లున్నారు జాగ్ర‌త్త’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. స‌తీష్ త్రిపుర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు, గ్లింప్స్ సినిమాపై విప‌రీత‌మైన అంచ‌నాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఓ కారును దొంగలించే క్ర‌మంలో డోర్ ఓపెన్ చేసి లోప‌ల కూర్చుంటాడు.

కాసేప‌టి త‌ర్వాత డోర్ ఓపెన్ చేస్తే రాదు. ఎంత ప్ర‌య‌త్నించినా డోర్ ఓపెన్ అవ‌క, కార్లోనే ఇరుక్కుపోతాడు. కార్లో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాడా? వ‌స్తే ఎలా వ‌చ్చాడు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు ట్రైల‌ర్ చూస్తే తెలుస్తుంది. ట్రైల‌ర్ మొత్తం ఆస‌క్తిక‌రంగా సాగింది. కాల‌భైర‌వ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ థ్రిల్ ఫీల్‌ను క‌లిగిస్తుంది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. స‌ముద్ర‌ఖ‌ని కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 23న విడుద‌ల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles