Vikram completes 100 days of theatrical run ‘విక్రమ్’ శతదినోత్సవం.. కమల్ హాసన్ ట్వీట్ వైరల్.!

Kamal haasan thanks fans as vikram completes 100 day run in theatres

Kamal Haasan, Suirya, Vikram, Lokesh Kanagaraj, Vijay Sethupathi, Fahadh Faasil, 100 days in theatre, OTT Release July 8th, kamal haasan twitter, kamal haasan audio clip, kollywood, tollywood, bollywood

Director Lokesh Kanakaraj's 'Vikram', featuring actors Kamal Haasan, Vijay Sethupathi and Fahadh Faasil in the lead, has now completed a magnificent 100-day run in theatres. The film, which continues to draw crowds to theatres despite having been released on OTT from July 8, has already grossed over Rs 400 crore from its box office collections worldwide. Kamal Haasan took to social media to thank fans for the film's success, posting an audio clip.

‘విక్రమ్’ శతదినోత్సవం.. కమల్ హాసన్ ట్వీట్ వైరల్.!

Posted: 09/10/2022 08:21 PM IST
Kamal haasan thanks fans as vikram completes 100 day run in theatres

లోకేష్ క‌న‌గ‌రాజ్‌ ద‌ర్శ‌క‌త్వంలో లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ హీరోగా రూపోందించిన తాజా ఔటింగ్ ‘విక్ర‌మ్‌’ శతదినోత్సవాన్ని జరుపుకుంటోంది. తమిళనాడులోని మూడు నాలుగు థియేటర్లలో ఇప్పటికీ సినిమాను ప్రదర్శిస్తున్నారు. జూన్ 3న విడుద‌లైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచ‌ల‌నాలు సృష్టించింది. త‌మిళంలో ‘బాహుబ‌లి-2’ రికార్డును బ్రేక్ చేసి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. విడుద‌లైన అన్ని ఏరియాల్లో డ‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. చాలా కాలం త‌ర్వాత క‌మ‌ల్‌కు విక్ర‌మ్ సినిమా భారీ విజ‌యం సాధించింది. ఇక‌ దాదాపు నాలుగేళ్ళ త‌ర్వాత క‌మ‌ల్ వెండితెర‌పై క‌నిపించ‌డంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు.

అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ సినిమాతో పాటు కథ, కథనం కూడా పూర్తి భిన్నంగా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. తాజాగా ఈ చిత్రం 100రోజులు పూర్తి చేసుకుంది. ఈ మ‌ధ్య కాలంలో ఒక సినిమా రెండు వారాలు అడుతుందంటేనే పెద్ద విష‌యం. అలాంటిది విక్ర‌మ్ 100రోజులు పూర్తి చేసుకొని త‌మిళ నాడులో ఇంకా రెండు మూడు థియేట‌ర్ల‌లో ప్ర‌దిర్శితం అవ‌తుందంటే విశేషం అనే చెప్పాలి. వంద రోజులు పూర్తయిన క్ర‌మంలో క‌మ‌ల్ ఓ వాయిస్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ వైర‌ల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీలో విడుద‌లై అక్క‌డ కూడా మంచి వ్యూవ‌ర్ షిప్‌ను సాధించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపు రూ.450కోట్లకు పైగా క‌లెక్ష‌న్‌ల‌ను సాధించింది.

తెలుగులో ఈ చిత్రానికి దాదాపు రూ.18 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్‌లు వ‌చ్చాయి. దీంతో విక్ర‌మ్ సినిమాకు తెలుగులో రూ.10కోట్ల‌కు పైగానే ప్రాఫిట్స్ వ‌చ్చాయి. హీరో నితిన్ శ్రేష్ఠ్‌ మూవీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని విడుద‌ల చేశాడు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర్య రోలెక్స్ పాత్ర‌లో 5 నిమిషాలు మెరిసాడు. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్ప‌వ‌చ్చు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles