Lavayna Tripathi 'Happy Birthday' Movie Trailer ఆకట్టుకుంటోన్న లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్తడే’ ట్రైలర్

Happy birthday teaser lavanya tripathi shines in a crazy world where people live on the edge

Happy Birthday Movie Trailer, Lavanya Tripathi, Ritesh Rana, Kaala Bhairava, Mythri Movie Makers, Satya, Vennela Kishore, Happy Birthday, Happy Birthday Trailer, HBD Trailer, Happy Birthday Movie, Lavanya Tripathi's Happy Birthday, Happy Birthday 2022 Movie, Lavanya Tripathi Movies, Vennela Kishore Comedy, Satya Comedy, Kaala Bhairava Music, Kaala Bhairava Songs, Mythri Movie Makers Movies, HBDMovie, HBDMovieOnJuly8, Telugu Movies, Tollywood, Movies, Enterrtainment

Director Ritesh Rana's second venture will be Happy Birthday starring Lavanya Tripathi in an unconventional role. To give an insight into his next, the maker has dropped the fascinating teaser of this action comedy-drama. Sharing the teaser of Happy Birthday, the makers tweeted, ''Intintiki Gun-u, Eduru Leni Fun-u, #HappyBirthday Fun Blasting Teaser out now.''

ఆకట్టుకుంటోన్న లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్తడే’ ట్రైలర్

Posted: 06/29/2022 05:51 PM IST
Happy birthday teaser lavanya tripathi shines in a crazy world where people live on the edge

హీరోయిన్​ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. ఈ చిత్రాన్ని దర్శకుడు రితేశ్‌ రానా రూపోందించగా, ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్​ను రిలీజ్​ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ నెట్టింట్లో ప్రేక్షకులను అలరించడమే కాదు నవ్వులు కూడా పూయిస్తోంది. ఈ సినిమా కథ తుపాకుల చుట్టూ తిరుగుతుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. చిత్ర ట్రైలర్ అరంభం నుంచి ముగింపు వరకు అంతా తుపాకుల గోలే. అయితే డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి.

ట్రలర్ ప్రారంభం కాగానే.. 'నా ఏడు వారాల నగలతో చేయించా. నేనూ నా రవ్వల నెక్లెస్‌తో చేయించా', అంటూ మహిళలు మాట్లాడుకోవడం.. 'రివాల్వర్‌లో ఉండే రాజసం పిస్తోల్లో లేదండి','ఆవేశం అగ్గిపుల లాంటిది ఒక్కసారే వెలిగించవచ్చు. కానీ ఆశయం లైటర్ లాంటిది. ఎన్ని సార్లు అయినా వెలిగించవచ్చు' అనే సంభాషణలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. 'వాడు ప్రొఫెషనల్‌ కిల్లర్‌ అయితే నేను పెయిన్‌ కిల్లర్‌' అని సత్య చెప్పడం, దానికి వెన్నెల కిశోర్‌ కౌంటర్‌ ఇచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి.

ట్రైలర్‌లో కనిపించిన ప్రతి పాత్ర చేతిలోనూ గన్‌ కనిపించింది. అసలు వీరందరికీ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్న విషయాన్ని పక్కనబెడితే.. వీరంతా గన్స్ పట్టుకుని ఏం చేస్తున్నారు.? అసలెందుకు గన్స్ పట్టుకున్నారు.?, వీటికీ బర్త్‌డే పార్టీకి సంబంధమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నరేశ్‌ అగస్త్య కీలక పాత్ర పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles