Ram Pothineni refutes rumours of marriage కెరీర్ పైనే దృష్టి.. అప్పుడే పెళ్లేంటీ: రూమర్స్ పై రామ్

Ram pothineni refutes rumours of getting married to secret high school sweetheart

Ram potineni reacted on rumours of his marriage, Ram potineni Marriage, Ram potineni, Ram potineni movies, Ram potineni love story, Ram potineni the warrior movie, ram potineni boyapati movie, Ram Pothineni wedding, Ram Pothineni marriage, Ram Pothineni girlfriend, ram pothineni, The Warrior, Tollywood, Movies, Entertainment

Actor Ram Pothineni finally breaks the silence over the rumours of him getting hitched to his 'secret high school sweetheart'. The actor took to Twitter to clear the air over the reports and denied saying that he 'hardly went to high school'. He further asked people to stop spreading rumours about his wedding. The actor also revealed that it has come to a point where he has to convince his family and friends that he is not getting married to any 'high school sweetheart'.

కెరీర్ పైనే దృష్టి.. అప్పుడే పెళ్లేంటీ: రూమర్స్ పై రామ్

Posted: 06/29/2022 06:48 PM IST
Ram pothineni refutes rumours of getting married to secret high school sweetheart

టాలీవుడ్​ బ్యాచిలర్స్​రో ఒకరైన యంగ్ హీరో రామ్ ​పోతినేని.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని ఇటీవలే జోరుగా ప్రచారం సాగింది. సామాజిక మాద్యమాల్లో విపరీతంగా ఈ మేర ప్రచారం ఊపందుకుంది. ఎక్కడ చూసినా ఈయన పెళ్లి గురించే వార్తలు ట్రెండ్ అయ్యాయి. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్​ మేట్​ను వివాహం చేసుకోనున్నట్లు కథనాలు వచ్చాయి. కొంతకాలం నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, వివాహ బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారంటూ అంతా మాట్లాడుకున్నారు.

అయితే తాజాగా ఈ రూమర్స్​పై స్పందించారు హీరో రామ్​. "ఓరి దేవుడా, ఇక చాలు దయచేసి ఆపండి. నేను రహస్యంగా ఏ​ హై స్కూల్​ ఫ్రెండ్​ను పెళ్లి చేసుకోవట్లేదు. ఇదంతా ఎవరి సృష్టో తెలియదు కానీ.. ఈ కల్పిత కథనాలపై సన్నిహితులు, కటుంబసభ్యులకు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది నిజమేనా అంటే వారి వద్ద నుంచి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇక నిజం చెప్పాలంటే.. హై స్కూల్​కు నేనెప్పుడు సరిగ్గా వెళ్లలేదు" అంటూ రామ్​ పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. 'ఇస్మార్ట్​ శంకర్'​తో సూపర్​ సక్సెస్​ను అందుకున్న రామ్​.. ఆ తర్వాత నుంచి దూకుడు కొనసాగిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఆయన నటించిన 'ది వారియర్'​ త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు ఆయన ఊరమాస్​ డైరెక్టర్​ బోయపాటితో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుందీ చిత్రం. వరుస సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ మధ్య గడుపుతున్న తనపై పెళ్లి అంటూ కల్పిత కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh