'రాధేశ్యామ్' సినిమా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ నిన్న చేసిన ట్వీట్ కు అర్థం ఏంటో తెలిసిపోయింది. కాలం చాలా కఠినమైందంటూ నిరాశ వ్యక్తం చేస్తూ ఆయన నిన్న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన ఎందుకు ఆ ట్వీట్ చేశారో ఎవరికీ అర్థం కాలేదు. రాధేశ్యామ్ సినిమాను కూడా వాయిదా వేస్తున్నారా? అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేశారు. చివరకు వారి సందేహాలే నిజమయ్యాయి. ఆ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఆ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
కరోనా విజృంభణ మళ్లీ మొదలైన నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆ సినిమా యూనిట్ తెలిపింది. ఈ నెల 7న విడుదల కావలసిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా యూనిట్ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడిన నేపథ్యంలో రాధేశ్యామ్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు ముందు నుంచే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, వాయిదా వేయబోమని 'రాధేశ్యామ్' సినిమా యూనిట్ ఇటీవల ప్రకటించింది.
కాగా దేశంలో కరోనా వ్యాప్తి మరోసారి కలకలం రేపుతోన్న నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోకతప్పలేదు. కరోనా విజృంభణతో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. కొన్ని రోజుల్లో మరిన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు విడుదల చేస్తే నష్టాలు తప్పవని భావిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాల యూనిట్లు దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కొత్త విడుదల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలను తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more