Allu Arjun's 'Pushpa' to release on OTT Platform ఓటీటీ రికార్డులను తిరగరాసేందుకు వస్తున్న ‘పుష్ప’

Allu arjun s pushpa the rise to premiere on ott from this date

Pushpa, Allu Arjun, Rashmika mandana, sukumar, DSP, Indravathi Chauhan, Pushpa The Rise, Pushpa Promotions, Pushpa Tamil, Pushpa allu arjun, Pushpa sukumar, Pushpa Rashmika, Pushpa Telugu movie, Allu Arjun movies, allu arjun galary, allu arjun photos, allu arjun songs, allu arjun cinemas, allu arjun updates, allu arjun upcoming movies, allu arjun breaking news, allu arjun breaking updates, allu arjun lineup of films, allu arjun upcoming projects, Tollywood, Movies, Entertainment

After winning hearts at the Box Office, Allu Arjun’s Pushpa: The Rise Part I is now set to entertain the audience on an OTT platform. The film is still doing good business in theatres, especially its Hindi version but the makers have now decided to cash in on the buzz and release it on OTT.

ఓటీటీ రికార్డులను తిరగరాసేందుకు వస్తున్న ‘పుష్ప’

Posted: 01/05/2022 08:53 PM IST
Allu arjun s pushpa the rise to premiere on ott from this date

తెలుగు చిత్రసీమ ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇక తాజాగా వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు రూపోందుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు ‘పుష్ప’ ది రైజ్ తొలిభాగం చిత్రం గతనెల 17న విడుదలైంది. ఈ చిత్రం బాక్సీఫిసు వద్ద రికార్డులను తిరగరాస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ హ్యాట్రిక్ చిత్రంగా రూపోందిన ఈ చిత్రం త్వరలోనే ఓటిటీలో ప్రసారం కానుంది. ఎవ‌రూ ఊహించని విధంగా తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌లయాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో ఈ సినిమా అద్భుత‌మైన విజ‌యం అందుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 80 కోట్ల‌కు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఈ సినిమా థియేట‌ర్స్‌లో అద్భుత‌మైన క‌లెక్ష‌న్లు తీసుకొస్తున్న స‌మ‌యంలోనే ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఓ వైపు హిందీలో రూపోందించిన ఈ చిత్రం ఓవర్ సీస్ లో విడుదల అవుతున్న క్రమంలోనే ఇటు తెలుగు సహా దక్షిణాదిలోని నాలుగు బాషల్లో ఈ చిత్రం ఓటిటీలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని ఉన్నఫళ్లంగా తమ ఓటీటీలో ప్రదర్శించేందుకు అనుమతి పోందిన అమెజాన్  ప్రైం అందుకుగాను భారీ ఆఫర్ ను కూడా ప్రకటించిందని టాక్. దీంతో సినిమా విడుద‌లైన నాలుగు వారాల‌కే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో సంద‌డి చేయనుంది.

పుష్ప సినిమా హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బాలీవుడ్‌లో 60 కోట్ల మార్కు అందుకుంది. 75 కోట్ల వైపు ప‌రుగులు తీస్తోంది. సాధార‌ణంగా పెద్ద సినిమాల‌కు క‌నీసం 50 రోజుల గ్యాప్ ఉంటుంది. అయితే సినిమాను అమ్మేట‌ప్పుడు నిర్మాత‌లు చేసుకునే ఒప్పందాన్ని బ‌ట్టి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మూడు నుంచి నాలుగు వారాల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాయి. ఇప్పుడు పుష్ప సినిమాకు కూడా అలాగే నాలుగు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమింగ్ కానుంది. జ‌న‌వ‌రి 7న సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ప్ర‌క‌టించింది. హిందీ మిన‌హా తెలుగు, తమిళ‌, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pushpa  Allu Arjun  Rashmika mandana  sukumar  DSP  Pushpa The Rise  Pushpa Promotions  Pushpa Tamil  Kollywood  

Other Articles