'The Voice Of Ravanna' from Virata Parvam రానా పుట్టినరోజున విరాటపర్వం నుంచి ‘వాయిస్ అఫ్ రవన్న’

The voice of ravanna from virata parvam is unveiled on rana s birthday

Virata parvam, Voice of Ravanna, Rana Daggubati, Sai Pallavi, Venu Udugula, Suresh Bobbili, Sudhakar Cherukuri, Rana Daggubati movies, Rana Daggubati songs, Rana Daggubati latest news, Sai Pallavi latest news, Sai Pallavi upcomming movies, Tollywood, movies, Entertainment

The makers of Tollywood's handsome hunk Rana Daggubati and Sai Pallavi starrer Virata Parvam released a special video named "The Voice of Ravanna" on the occasion of Rana's birthday and is receiving positive remarks from the critics and movie lovers. From the video, one can catch a glimpse of Rana who played the role of Ravanna and Sai Pallavi's love story and the powerful dialogue of Rana brings goose bumps to everyone.

రానా పుట్టినరోజున విరాటపర్వం నుంచి ‘వాయిస్ అఫ్ రవన్న’

Posted: 12/14/2021 07:31 PM IST
The voice of ravanna from virata parvam is unveiled on rana s birthday

రానా దగ్గుబాటి, సాయిపల్లవి ప్రధాన పాత్రలో నక్సల్స్ బ్యాగ్రౌండ్‌లో వస్తోన్న తాజా చిత్రం విరాటపర్వం. పొలిటికల్‌ పీరియాడిక్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వంలో వహిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ 30న విడుదలకావాల్సి ఈ చిత్రం.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. తెలంగాణ ప్రాంతంలోని 1980 - 1990ల మధ్యకాలంలో అప్పటి సామాజిక పరిస్థితుల ఆధారం వస్తోంది. అందులో భాగంగా అప్పటి దళారుల వ్యవస్థను ఈ సినిమాలో చర్చించనున్నారు దర్శకుడు వేణు ఊడుగుల.

ఈ సినిమాలో రానా రవన్న అనే కామ్రేడ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో  రానా, సాయి పల్లవి ,నివేతా పేతురాజ్, ప్రియమణి, నందితా దాస్‌, నవీన్ చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీ రావు, సాయిచంద్ ముఖ్య పాత్రలు పోషించారు. బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీ ప్రసాద్‌, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి ఇతర పాత్రల్లో నటించారు. విరాటపర్వం మూవీకి  సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.

ఈరోజు రానా బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి రానా వాయిస్‌తో కూడిన ఓ వీడియోను విడుదల చేసారు. మారదులే.. ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే.. రౌద్రపు శక్తి దాడిని ఎదురించే పోరాటం మనదే. చలో.. ఛలో.. ఛలో పరిగెత్తు.. అడుగే పిడుగై.. గుండెల దమ్మును చూపించు. ఛలో.. పరిగెత్తు.. చీకటి మింగిన సూర్యుడిని తెచ్చి తూర్పు కొండను వెలిగిద్దాం.. పొంగిన వీపుల బరువులు దించి విప్లవ గీతం వినిపిద్దాం. ఛలో.. ఛలో .. పరిగెత్తు.. ఛలో పరిగెత్తు.. తెరవని తలుపుకు తాళంలా.. గడిల ముందు కుక్కల్లా.. ఎన్నాళ్లు.. ఇంకెనాళ్లు.. ఛలో పరిగెత్తు.. ఛలో పరిగెత్తు అంటూ రానా గొంతు పలికిన భావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles