Allu Arjun impresses Tamil fans in Pushpa event తమిళ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరంటే: బన్నీ బదులిది..

Allu arjun impresses tamil fans in pushpa pre release event

Pushpa, Allu Arjun, Rashmika mandana, sukumar, DSP, Indravathi Chauhan, Pushpa The Rise, Pushpa Promotions, Pushpa Tamil, Pushpa allu arjun, Pushpa sukumar, Pushpa Rashmika, Pushpa Telugu movie, Allu Arjun movies, allu arjun galary, allu arjun photos, allu arjun songs, allu arjun cinemas, allu arjun updates, allu arjun upcoming movies, allu arjun breaking news, allu arjun breaking updates, allu arjun lineup of films, allu arjun upcoming projects, Tollywood, Movies, Entertainment

Pushpa: The rise is all set to hit the big screens this Friday and the lead actor Allu Arjun who has Tamil roots impressed fans and press by conversing in Tamil at the pre-release event. The film is all set to be released in five languages all over Indian and Allu shared his excitement of having a Tamil release for the first time.

తమిళ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరంటే: బన్నీ బదులిది..

Posted: 12/14/2021 08:23 PM IST
Allu arjun impresses tamil fans in pushpa pre release event

తెలుగు చిత్రసీమ ఇప్పుడు భారతీయ చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. బాహుబలి చిత్రాలతో తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇక తాజాగా వరుసపెట్టి పాన్ ఇండియా చిత్రాలు రూపోందుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు ‘పుష్ప’ ది రైజ్ తొలిభాగం చిత్రం ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ముమ్మరంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హీరో అల్లు అర్జున్ నేడు చెన్నైలో పుష్ప ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రసంగం తమిళంలోనే సాగింది.

తన చిత్రాలు బాలీవుడ్ లోనూ డబ్ అవుతుంటాయని, అయితే తనకు తమిళనాడులో మంచి నటుడిగా గుర్తింపు పొందాలన్నది ఓ కోరిక అని తెలిపారు. తన సినిమాలు తమిళనాడులోనూ విజయం సాధించాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. పుష్ప చిత్రంతో తన ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నానని, ఈ సినిమా పాటలు తమిళనాడు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. తన ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు ఇచ్చారని, అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

ఇక, "మీరు మంచి డ్యాన్సర్ కదా, తమిళంలో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరు?" అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, బన్నీ సమాధానమిచ్చారు. మునుపటి తరంలో కమల్ హాసన్ సర్ అద్భుతమైన డ్యాన్సర్ అని కొనియాడారు. ఆ తర్వాతి తరంలో విజయ్, ఇప్పటి జనరేషన్ లో ధనుష్, శింబు, ఇతర యువ హీరోలంతా మంచి డ్యాన్సర్లేనని పేర్కొన్నారు. తాను తమిళ సినిమాలు కూడా చూస్తుంటానని తెలిపారు. ఇటీవల శివకార్తికేయన్ నటించిన 'డాక్టర్' చిత్రాన్ని చూశానని, బాగా నచ్చిందని వెల్లడించారు. బన్నీ పెరిగింది చెన్నైలోనే కావడంతో తమిళంలో అనర్గళంగా మాట్లాడగలరు. ఇవాళ ప్రెస్ మీట్లోనూ ఎక్కడా తడబాటు లేకుండా తమిళంలో మాట్లాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pushpa  Allu Arjun  Rashmika mandana  sukumar  DSP  Pushpa The Rise  Pushpa Promotions  Pushpa Tamil  Kollywood  

Other Articles