First glimpse as Daniel Shekar from Bheemla Nayak భీమ్లా నాయక్ నుంచి డానియల్ శేఖర్ బ్లిట్జ్స్

Rana daggubati s first look video for bheemla nayak released

Bheemla Nayak, Pawankalyan, Daggubati Rana, Daniel shekar, Trivikram, Saagar K Chandra, Sithara Entertainments, Thaman, Suryadevara Naga Vamsi, Tollywood, Movies, Entertainment

Rana Daggubati's first glimpse from the film 'Bheemla Nayak' was released today at 6.03 pm by the film unit. This glimpse acts as a curtain raiser for Rana Daggubati's embodiment and insight towards Daniel Shekar's character dynamics.

ITEMVIDEOS: భీమ్లా నాయక్ నుంచి డానియల్ శేఖర్ బ్లిట్జ్స్

Posted: 09/20/2021 07:38 PM IST
Rana daggubati s first look video for bheemla nayak released

టాలీవుడ్  ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లానాయ‌క్. పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, పాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి కాంబినేష‌న్ లో రూపోందుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ గ్లింఫ్స్ విడుదల కావడం.. అది కాస్తా నెట్టింట్లో విపరీతంగా వైరల్ కావడంతో రికార్డు స్థాయి వ్యూవ్స్ కూడా లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ స్క్రీన్ ప్లే, మాట‌లు అందిస్తుండ‌గా.. సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ టైటిల్ రోల్ చేస్తుండ‌గా.. రానా డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర పోషిస్తున్నాడు. కాగా మేక‌ర్స్ డానియ‌ల్ శేఖ‌ర్ ప‌రిచ‌యం చేస్తూ వీడియోను విడుద‌ల చేశారు.

నీ మొగుడు గ‌బ్బ‌ర్ సింగ్ అంట స్టేష‌న్ లో టాక్ న‌డుస్తోంది..నేనెవ‌రో తెలుసా..? ధ‌ర్మేంద్ర హీరో అంటూ డిఫ‌రెంట్ డైలాగ్ డెలివ‌రీతో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు రానా. ఓ వైపు భీమ్లానాయ‌క్, మ‌రోవైపు డానియెల్ శేఖ‌ర్..ఈ ఇద్ద‌రి పోటాపోటీ యాక్టింగ్ తో థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌కు పూన‌కాలు తెప్పించ‌డం ఖాయ‌మ‌ని తాజాగా విడుద‌ల చేసిన వీడియో ద్వారా అర్థ‌మ‌వుతోంది. భీమ్లా నాయ‌క్ చిత్రాన్ని 2022 జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేస్తున్నారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.ఎస్ థ‌మ‌న్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఇప్ప‌టికే అంద‌రిలో ఫుల్ జోష్ నింపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bheemla Nayak  Pawankalyan  Daggubati Rana  Daniel shekar  Trivikram  Saagar K Chandra  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh