Chiranjeevi and Charan back to the sets of Acharya ఆచార్య షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టిన చిరు-చ‌ర‌ణ్‌

Shooting resumes chiranjeevi and charan back to the sets of acharya

Acharya, Chiranjeevi, ram charan, shooting, koratala siva, Kajal agarwal, Manisharma, Niranjan Reddy, Konidela productions, matniee entertainments, Tollywood, Movies, Entertainment

Top director Koratala Siva is all set to offer a perfect treat for Mega fans as Chiranjeevi and Charan are working together for a full-fledged movie. The film is titled Acharya and it is in the final stages of the shoot.

ఆచార్య షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టిన చిరు-చ‌ర‌ణ్‌

Posted: 09/16/2021 09:25 PM IST
Shooting resumes chiranjeevi and charan back to the sets of acharya

చారిత్రక నేపథ్య చిత్రం సైరా న‌ర‌సింహ‌రెడ్డి త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న చిత్రం ఆచార్య‌. ఈ సినిమా కొన్నేళ్లుగా షూటింగ్ జ‌రుపుకుంటూనే ఉంది. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ స్టార్ట్ చేయడం.. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉండటంతో రెండు పాటలు పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు  ఈ రెండు పాటలను కూడా పూర్తి చేసి పనిలో పడ్డారు తండ్రితనయుడు. ఈ క్రమంలో ఇవాళ ఈ రెండు పాటల చిత్రకరణ పనులు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

హైద‌రాబాద్ శివార్ల‌లో ఆచార్య కోసం ప్ర‌త్యేక‌మైన సెట్ రూపొందించ‌గా, ఇందులో రాంచ‌ర‌ణ్‌- చిరంజీవిల‌పై ఓ పాటను చిత్రీక‌రణ సాగనుందని తెలుస్తోంది. కోరటాల దర్శకత్వంలో రూపోందుతున్న ఈ పాట చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని.. ఇది మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రానికి సంబంధించిన మ‌రో పాట చరణ్ – హీరోయిన్ పూజా హెగ్డే లపై చిత్రీక‌రించ‌నున్నారు. ఇది వ‌చ్చే వారం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

సెప్టెంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కు ఆచార్య షూటింగ్ పూర్తి చేయాల‌ని భావిస్తుండ‌గా, థియేట‌ర్స్ స‌మ‌స్య‌పై క్లారిటీ వ‌చ్చాక ఆచార్య చిత్ర రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానుంది. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. నిరంజన్ రెడ్డి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles