టాలెంటెడ్ బ్యూటీ ఆనంది ఈ ఏడాది జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వరంగల్ భామ ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న విలేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలో నటిస్తోంది. పలాస ఫేం కరుణకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతొన్న తాజా చిత్రం విడుదలకు సిద్దంగా వుంది. ఈ నెల 27న ప్రపంచ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
'చుక్కల మేళం .. దిక్కుల తాళం .. ఒక్కటయే ఈ సంబరం .. ఆ సాంతం నీ సొంతం' అంటూ ఈ పాట సాగుతోంది. ఖవాలి వరుసల్లో మణిశర్మ ఈ బాణీ కట్టారు. ఈ తరహా పాటలు బాగా చేస్తారనే పేరు మణిశర్మకు ఉంది. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి గాత్రంతో ఈ పాట సాగింది. ఈ చిత్రంలోసోడాల శ్రీదేవి పాత్రలో కనిపించిన ఆనంది.. ఈ పాటలో మాత్రం పదహారణాల తెలుగుదనంతో కట్టిపడేసేలా అందమైన కుందనపు బొమ్మలా కనిపించింది.
మరోవైపు సుధీర్ బాబు కూడా గడ్డంతో పాటు కొత్త లుక్ తో కనిపిస్తున్నారు. 84 బోట్లతో చిత్రీకరించిన క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ స్టోరీతో పలాస సినిమా తెరకెక్కించి మంచి హిట్టు కొట్టాడు కరుణ కుమార్. ఈ సినిమా సక్సెస్ తో అగ్ర నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more