Daniel shekar teaser soon from 'Bheemla Nayak' ‘భీమ్లా నాయక్’ నుంచి త్వరలో ‘డానియల్’ టీజర్

Daniel shekar teaser soon from pawan kalyan rana starer bheemla nayak

Bheemla nayak, Power Star pawan kalyan, Pawan Kalyan Bheemla Nayak, Rana Dagubati, Daniel shekar, Rana fans, first glimpse, Teaser, Nithya Menen, Trivikram, Saagar K Chandra, Thaman S, Suryadevara Naga Vamsi, Tollywood, movies, Entertainment

The first glimpse of Power Star Pawan Kalyan as Bheemla Nayak from PSPK-Rana movie made fans happy, but Rana fans are dissapointed with not having their star in the first glimpse. Taking this point the film unit assured fans a teaser with Rana as Daniel Shekar as soon as possible.

‘భీమ్లా నాయక్’ నుంచి త్వరలో ‘డానియల్’ టీజర్

Posted: 08/17/2021 03:44 PM IST
Daniel shekar teaser soon from pawan kalyan rana starer bheemla nayak

పవర్ స్టార్ పవన్ కల్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా రూపోందుతున్న మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమేక్ గా భీమ్లా నాయక్ రూపోందుతున్న విషయం తెలిసిందే. పోలీసు అధికారి పాత్రలో పవన్ కల్యాణ్ మెరువనుండగా, సంపన్న యువకుడి పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పాత్రపేరే 'భీమ్లా నాయక్'. పవన్ పాత్ర ప్రధానంగా మొన్న ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్ డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ అభిమానుల ఆనందానికి ఫస్టు గ్లింప్స్ ఆంబరాన్ని అంటే ఆనందాన్ని అందించింది. అయితే ఈ ఫస్టు గ్లింప్స్ లో తమ అభిమాన నటుడు కనిపించకపోవడం పట్ల రానా దగ్గుబాటి అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానాకీ చోటు కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న చిత్రబృందం.. రానా అభిమానులను కూడా ఖుషీ చేసేందుకు త్వరలో సన్నధం అవుతుంది.

సాధ్యమైనంత త్వరలోనే రానా పాత్ర ప్రధానంగా ఒక టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ కనిపించనుండగా, రానా జోడీగా ఐశ్వర్య రాజేశ్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bheemla nayak  Power Star  pawan kalyan  Rana Dagubati  Daniel shekar  Rana fans  first glimpse  Teaser  Tollywood  

Other Articles