Vivaha Bhojanambu Official Trailer Out నవ్వులు కురిపిస్తున్న వివాహ బోజనంబు ట్రైలర్

Vivaha bhojanambu trailer talk a complete laugh riot

Vivaha Bhojanambu, Satya, Aarjavee, Ram Abbaraju, AniVee, K.S Sinish, Sundeep Kishan, Aarjavee, Sudharsan, Subbaraya Sharma, TNR, Viva Harsha, Tollywood, Movies, Entertainment

Vivaha Bhojanambu trailer got released a while back. The trailer inspired by true incidents packs a punch of comic ride with the opening scene itself. The first lockdown announcement triggered panic attacks among many.

నవ్వులు కురిపిస్తున్న వివాహ బోజనంబు ట్రైలర్

Posted: 08/04/2021 07:57 PM IST
Vivaha bhojanambu trailer talk a complete laugh riot

కమెడియన్ సత్య హీరోగా 'వివాహ భోజనంబు' సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ నేపథ్యంలో ఓ పిసినారి వ్యక్తికి పెళ్లి జరగడం.. ఆయన కుటుంబంతో పాటు అత్తారింటివారు వారింటికి వచ్చిన తరుణంలో లాక్ డౌన్ అమల్లోకి రావడం.. దీంతో ఆయనకు ఖర్చులు పెరిగిపోవడం.. ఈ కథలో నిజజీవిత సన్నివేశాలతో కూడిన కథనాలు కూడా కల్పించి నవ్వుల పువ్వులు పూయించేలా చిత్రాన్ని మలిచాడు దర్శకుడు రామ్ అబ్బరాజు.

హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో ఓ పాత్రలో కనిపిస్తూనే .. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను సోనీ లైవ్ ఓటీటీ ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సోనీ లైవ్ ద్వారా రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లాక్ డౌన్ నేపథ్యం చుట్టూ అల్లుకున్న హాస్యభరితంగా కథ ఇది అనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. సత్య చాలా పొదుపరి..  ప్రతి పైసా ఆచూతూచి ఖర్చు చేసే టైపు. అతని పెళ్లికి బందువులు వస్తారు.

పెళ్లి కాగానే లాక్ డౌన్ పడిపోతుంది. దాంతో బంధువులంతా ఆయన ఇంట్లోనే తిష్ఠ వేస్తారు. ఇక వాళ్లను పోషించడానికి ఆయన పడిన అవస్థలే ఈ సినిమా.  చాలామంది ఇలాంటి అనుభవాలు పొందినవారే కనుక,  కాన్సెప్ట్ చాలా సరసంగా అనిపిస్తోంది. ఈ సినిమాతో కొత్త కథానాయిక పరిచయమవుతోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఓటీటీ ద్వారా ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ రాబడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vivaha Bhojanambu  Satya  Aarjavee  Ram Abbaraju  AniVee  K.S Sinish  Sundeep Kishan  Tollywood  

Other Articles