Black Teaser: Aadi's Intense Cop Story ఆది సాయికుమార్ హైప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాక్’ నుంచి టీజర్

Sudheer babu launches aadi sai kumar s black teaser

Aadi Sai Kumar, BLACK Teaser, Darshana banik, Amani, GB Krishna, suresh bobbili, Mahankali Diwakar, Sudheer Babu, action-packed stunt, Tollywood, Movies, Entertainment

Actor Sudheer Babu has launched the official teaser of Aadi Sai Kumar’s upcoming film 'Black.' Aadi, who plays a cop, appears wearing his uniform in one of the frames in the teaser. The one-minute three seconds teaser features action-packed stunt sequences with thumping high-speed music playing in the background.

ఆది సాయికుమార్ హైప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాక్’ నుంచి టీజర్

Posted: 08/07/2021 04:45 PM IST
Sudheer babu launches aadi sai kumar s black teaser

ప్రేమకావాలి, ‘లవ్లీ, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన‌ నటుడు ఆది త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంత‌గానో కృషి చేస్తున్నాడు. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్‌గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్త ప‌డ‌తున్నాడు. వ‌రుస సినిమాల‌ను లైన్‌లో పెట్టిన సాయి కుమార్ త‌న‌యుడు ఆది సాయికుమార్ ఈ మధ్య తన దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తోంది.

'అమరన్', 'కిరాతక', 'బ్లాక్' సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఒకదానితో ఒకటి ఎంతమాత్రం సంబంధంలేని కథలను ఆయన చేస్తూ వెళుతున్నాడు. బ్లాక్ చిత్రాన్ని దర్శకుడు జీబీ కృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  ఈ చిత్రం నుంచి టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది మాత్రం ఆది కెరీర్ లో వచ్చిన సినిమాల్లో మంచి ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. థ్రిల్ల‌ర్ బ్యాక్ డ్రాప్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ని టీజ‌ర్‌ని బ‌ట్టి అర్ద‌మ‌వుతుంది.

టీజ‌ర్‌లో ఆది చెప్పే డైలాగ్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఈ సినిమాని మంచిగా ప్రమోట్ చేసి వదిలితే ఆది కెరీర్ లో మంచి హిట్ గా నిలవొచ్చు. ఈ చిత్రంలో ఆది సరసన దర్శన హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం అతను ‘అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌-1’అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆది కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. ఎస్.బాలవీర్ రచన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్‌వీఆర్ నిర్మిస్తున్నారు. అవికా గోర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆది తండ్రి సాయి కుమార్ ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles